Kalki : కల్కి టైటిల్ వెనుక ఇంత కథ ఉందా? నాగ్ అశ్విన్ మామూలోడు కాదు!

"కల్కి 2898 AD" టైటిల్ చూస్తుంటే సైన్స్ ఫిక్షన్ సినిమాకు కాస్త మైథలాజికల్ టచ్ కూడా ఇచ్చినట్టు కనిపిస్తోంది. పురాణాల్లో మహా విష్ణువు అవతారాల్లో పదో అవతారం కల్కి. 'కళంకం' లేదా 'కలక' అంటే దోషం వాటిని హరించేవాడే కల్కి అని, ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీర ఖడ్గం ధరించి, తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ, దుష్టులను శిక్షిస్తాడని మన పురాణాలు చెపుతున్నాయి.

Written By: Shiva, Updated On : July 21, 2023 10:59 am
Follow us on

 Kalki : ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా యావత్తు సినీ ప్రపంచం ఎదురుచూస్తున్నా ప్రాజెక్ట్ కె గ్లింప్స్ తో పాటుగా టైటిల్ విడుదల చేశారు. గురువారం రాత్రి  శాన్ డియాగో   కామిక్ కాన్ లో రిలీజ్ చేయటం జరిగింది. ముందుగా టైటిల్ గురించి చెప్పాలంటే, ఇంత కాలం ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ తో నడిచిన ఈ సినిమాకు “కల్కి 2898 AD” అనే టైటిల్ పెట్టారు. మొదటి నుండి కల్కి, కర్ణ, కురుక్షేత్ర లాంటి పేర్లు వినిపించినా కానీ చివరికి కల్కి నే ఫైనల్ చేశారు.

“కల్కి 2898 AD” టైటిల్ చూస్తుంటే సైన్స్ ఫిక్షన్ సినిమాకు కాస్త మైథలాజికల్ టచ్ కూడా ఇచ్చినట్టు కనిపిస్తోంది. పురాణాల్లో మహా విష్ణువు అవతారాల్లో పదో అవతారం కల్కి. ‘కళంకం’ లేదా ‘కలక’ అంటే దోషం వాటిని హరించేవాడే కల్కి అని, ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీర ఖడ్గం ధరించి, తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ, దుష్టులను శిక్షిస్తాడని మన పురాణాలు చెపుతున్నాయి. దీనినే ప్రామాణికంగా తీసుకొని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడని తెలుస్తుంది.

అదే విధంగా టైటిల్ లో 2898 AD ని పెట్టారు. ప్రస్తుతం క్రీస్తు శకం (AC) నడుస్తుంది. గతాన్ని  క్రీస్తు పూర్వం (BC) గా పేర్కొన్నారు. కాబట్టి రాబోయే యుగాన్ని AD (Anno Domini) గా చెప్పటం జరిగింది. అంటే ప్రస్తుతం 2023 నడుస్తుంది, 2898 వరకు పాపాలు బాగా పెరిగిపోవడం వలన కల్కి అవతరిస్తాడు అనే కాన్సెప్ట్ తో ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఈ టైటిల్ పెట్టినట్లు తెలుస్తుంది. అదే విధంగా హాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు అర్ధం అవుతుంది.

ఇక గ్లింప్స్ విషయానికి వస్తే హాలీవుడ్ రేంజ్ లో ఉందనే చెప్పాలి. కాస్ట్యూమ్స్ నుంచి లైటింగ్ వరకు ప్రతిదీ హాలీవుడ్ స్టైల్ లో ఉండేలా జాగ్రత్త పడ్డాడు నాగ్ అశ్విన్. సూపర్ హీరోగా ప్రభాస్ లుక్, అతడి ఎంట్రీ బాగుంది. అమితాబ్, దీపిక పదుకొనే ను కూడా వీడియోలో చూడొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ ఫస్ట్ లుక్ మీద నడిచిన ట్రోల్స్ కు ఈ గ్లింప్స్ చెక్ పెట్టింది అంటే చెప్పాలి. దాదాపు 800 కోట్లు పైగా బడ్జెట్ తో అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024 లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.