Allu Arjun
Allu Arjun : గడిచిన ఐదేళ్ల నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ‘పుష్ప'(Pushpa) సిరీస్ కోసం ఎంత కష్టపడ్డాడో మనమంతా చూసాము. ఈ సినిమా షూటింగ్ లో విరామం లేకుండా కష్టపడడమే కాకుండా, జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రొమోషన్స్ కోసం కూడా ఆయన చాలా కష్టపడ్డాడు. ‘పుష్ప 2’ మూవీ విడుదల సమయంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, అల్లు అర్జున్ మానసికంగా ఎంత ఇబ్బందికి గురయ్యాడో మనమంతా చూసాము. దేశం మొత్తం రీ సౌండ్ వచ్చే రేంజ్ లో హిట్ కొట్టినప్పటికీ ఎంజాయ్ చేయలేని పరిస్థితి. ఇప్పటికీ ఆయనకు శ్రీతేజ్(Sritej) విషయంలో పూర్తి స్థాయి సంతోషం లేదు. ఎందుకంటే అతను ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నాడు. ఇలా ఎన్నో ఒత్తిడుల మధ్య అల్లు అర్జున్ బాగా నలిగిపోయాడు. కొత్త సినిమా షూటింగ్ అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వాళ్లకు ఇప్పుడు చేదు వార్త.
పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ ఇప్పట్లో మళ్ళీ కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి కొరకు స్పెయిన్ దేశానికి వెళ్లినట్టు సమాచారం. అక్కడ ఆయన డీ టాక్సినేషన్ పొందబోతున్నాడు అన్నమాట. ఐదేళ్ల నుండి అల్లు అర్జున్ ఒకే లుక్ లో ఉండడం వల్ల ఆయన చర్మం ఒక రంగు కి మారిపోయింది. అందుకే ఆయన డీ టాక్సినేషన్ చేయించుకోబోతున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాలో ఆయన సుబ్రమణ్య స్వామిగా కనిపించనున్నారు. పురాణాలకు సంబంధించిన కథ కావడంతో అల్లు అర్జున్ ఎక్కడా కూడా పొరపాటు లేకుండా చూసుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఆయన కొన్నాళ్ళు స్పెయిన్ లోనే గడపబోతున్నట్టు సమాచారం. ఇండియా కి తిరిగి రాగానే ఆయన మళ్ళీ షూటింగ్స్ తో బిజీ కాబోతున్నాడు. ఈ సినిమాతో పాటు ఆయన అట్లీ తో చేయబోయే సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి.
త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్. ఈ చిత్రం లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఎంచుకున్నారట. ఈ సినిమాతో పాటు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ తో కూడా ఒక సినిమా ఖరారు అయ్యిందట. రెండు మూడు సార్లు వీళ్లిద్దరు స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చున్నట్టు తెలుస్తుంది. ఇక సందీప్ వంగ(Sandeep Reddy Vanga) తో సినిమా ఖరారై చాలా కాలం అయ్యింది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాలంటే ముందుగా స్పిరిట్ చిత్రం పూర్తి అవ్వాలి. అదే విధంగా కొరటాల శివ కూడా అల్లు అర్జున్ కోసం ఒక కథ ని వినిపించాడు. వీళ్ళతో పాటు బాలీవుడ్ బడా దర్శకులు కూడా అల్లు అర్జున్ కి స్టోరీలు వినిపించడానికి ఎదురు చూస్తున్నారు. మరి ఆయన ఎంతమంది డైరెక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి. అయితే త్రివిక్రమ్ మూవీ షూటింగ్ నాలుగు నెలల తర్వాత మొదలు అవుతుందట.