Hero
Hero : *ఇండస్ట్రీలో కొంతమంది హీరో హీరోయిన్ల మధ్య ఫ్రెండ్షిప్ గాఢంగా ఉంటుంది.. ఇంకొంతమంది మధ్య అంతకుమించిన రిలేషన్ షిప్ ఉంటుంది.. మరి కొంతమంది హీరోలు వాళ్లకు పెళ్లయినా సరే తన తోటి హీరోయిన్లతో ఎఫైర్లను మెయింటైన్ చేస్తూ ఉంటారని సినిమా ఇండస్ట్రీలో చాలా ఓ టాక్ నడుస్తోంది….చాలా మంది హీరోల మీద ఇలాంటి వార్తలైతే గుప్పుమంటాయి…..ఇక హీరోయిన్ల పరిస్థితి అయితే మరి దారుణం గా ఉంటుంది…*
సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకునే ముందుకు సాగుతూ ఉంటారు… అయితే ఇండస్ట్రీలో ఒక సక్సెస్ వస్తే చాలు ప్రతి ఒక్కరూ వాళ్లకంటు ఒక ఐడెంటిటీని సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కుర్ర హీరోలు మాత్రం స్టార్ హీరోలుగా ఎదగడానికి మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తూ సక్సెస్ లు సాధిస్తారు…అయితే ఒక యంగ్ హీరో కెరియర్ మొదట్లోనే వరుసగా రెండు మూడు విజయాలను అందుకున్నాడు. దాంతో స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం సక్సెస్ లేక డీలాపడ్డాడు. ఇక ఇప్పుడు మాత్రం భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తనతోపాటు రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఒక పాన్ ఇండియా హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఆ స్టార్ హీరోయిన్ మాత్రం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను చేయడమే కాకుండా భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. మరి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది…
ప్రస్తుతానికైతే ఎవరి కెరియర్లో వాళ్ళు ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికి అవసరం దొరికిన ప్రతిసారి వాళ్ళు ప్రేక్షకులను కవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా కూడా వాళ్లు కలిసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయితే అవుతున్నాయి… ఇక ఫ్యూచర్లో కూడా వీళ్ళ కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
కొంత మంది దర్శక నిర్మాతలు కావాలనే ఈ హీరో హీరోయిన్ తో సినిమాలను చేయించుకోవడానికి వాళ్ల వెంట పడుతున్నారు. వీళ్ళ కాంబినేషన్ కి మంచి గుర్తింపు ఉంది. కాబట్టి ఆ కాంబినేషన్ కనక వర్కౌట్ అయితే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు ఈ కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో బిజీగా ఉంటున్నారు…
ఇక ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి తనకి ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి… ప్రస్తుతం పెద్దగా సక్సెస్ లు లేకపోయిన కూడా తనకోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… మరి ఈ కుర్ర హీరో ఆ పాన్ ఇండియా హీరోయిన్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…