JioHotstar plans
JioHotstar plans: రిలయన్స్ సంస్థకు చెందిన జియో సినిమా, స్టార్ నెట్‌వర్క్‌కు చెందిన డిస్నీ + హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఒక్కటయ్యాయి. డిస్నీ + హాట్‌స్టార్‌ను జియో కొనుగోలు చేసింది. దీంతో రెండు కలిసి ఇప్పుడు జియో హాట్‌స్టార్‌గా అవతరించాయి. దేశంలోని పలు టెలికం సంస్థలు తమ ప్లాన్స్‌లో భాగంగా రీచార్జ్‌తో ఓటీటీలను కూడా అందిస్తున్నాయి. ఇంతకాలం డిస్నీ + హాస్టార్, జియో సినిమాకు వేర్వేరుగా ప్లాన్స్ అందించాయి. ఇప్పుడు రెండు విలీనం కావడంతో టెలికం సంస్థలు తమ ప్లాన్స్ అప్‌డేట్ చేశాయి. టెలికాం, ఓటీటీ కోసం వేర్వేరు ప్లాన్లను రీచార్జి చేసుకోని వారికి ఈ ప్లాన్స్ ఉపయోగపడతాయి.
జియో ప్లాన్స్…
రిలయన్స్ జియో సంస్థ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఒకే ఒక్క ప్లాన్ అందిస్తోంది. రూ.949 రీచార్జి చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటాతో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 84 రోజులు హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.
ఎయిర్ టెల్..
ఇక ఎయిర్‌టెల్ సంస్థ కూడా ప్లాన్స్ అప్‌డేట్ చేసింది. మొత్తం మూడు రకాల ప్లాన్లను అందిస్తోంది. నెలవారీ, మూడు నెలలు, ఏడాది రీచార్జి ప్లాన్లతో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. డిస్నీ + హాట్‌స్టార్ స్థానంలో జియోహాట్‌స్టార్‌ను తీసుకువచ్చింది.
– రూ.3,999 రీచార్జితో రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు, 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.
– రూ1,029 ప్లాన్‌తో రీచార్జి చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాల్స్‌తోపాటు 84 రోజుల వ్యాలిడిటీ వస్తుంది.
– ఇక రూ.398తో రీచార్జి చేసుకుంటే.. రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ అభిస్తుంది.
– రూ.5.999 (150Mbps), రూ.1499 (300Mbps), రూ.2499 (500 Mbps), రూ.3999 (1GB), రూ.8499 (1GB) ప్లాన్స్‌తో జియోహాటర్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. జియో ఫైబర్లో నెలకు 3300 జీబీ డేటా వస్తుంది.
– రూ.5.599 (30 Mbps), రూ.5.899 (100 Mbps), 5. 1199 (100 Mbps) జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తున్నాయి. జియో ఎయిర్ ఫైబర్‌లో నెలకు 1000 జీబీ డేటా మాత్రమే ఇస్తుంది..