Nari Nari Naduma Murari Collection Day 12: ఈ సంక్రాంతికి ఎలాంటి చప్పుడు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద విస్ఫోటనం లాగా పేలిన మూవీ ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari). రామ్ అబ్బూరి దర్శకత్వం లో శర్వానంద్(Sharwanand) హీరో గా నటించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో చివర్లో విడుదలైంది. ఆ కారణం చేత థియేటర్స్ దొరకడం ఈ చిత్రానికి చాలా కష్టమైంది. కానీ ఆడియన్స్ నుండి పాజిటివ్ మౌత్ టాక్ రావడం, రోజురోజుకి డిమాండ్ పెరుగుతూ ఉండడం వల్ల బయ్యర్స్ క్రమంగా షోస్ పెంచడం మొదలు పెట్టారు. అలా అతి తక్కువ షోస్ తో మొదలైన ఈ సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం తర్వాత ఆడియన్స్ గెలిపించిన సినిమాగా నిల్చింది. ఇప్పటికీ కూడా ఈ చిత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు వెళ్తోంది. 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకోబోతున్న ఈ చిత్రం, ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబడుతుందో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం నుండి 4 కోట్ల 78 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, సీడెడ్ ప్రాంతం నుండి 1 కోటి 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక కోస్తాంధ్ర ప్రాంతం నుండి అయితే ఇప్పటి వరకు 6 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 12 కోట్ల 65 లక్షలు, 22 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 10 కోట్ల 25 లక్షల రూపాయలకు జరిగితే, కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావడం గమనార్హం. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 1 కోటి 2 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు ఓవర్సీస్ నుండి 3 కోట్ల 18 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 31 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా థియేట్రికల్ రన్ ఇక్కడితో ఆగిపోలేదు. మరో పది కోట్ల గ్రాస్ వసూళ్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సైలెంట్ గా గుట్టు చప్పుడు కాకుండా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ ని అందుకోవడం చాలా అరుదైన సంఘటన. 12 వ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నేడు కూడా ఈ చిత్రానికి 50 లక్షల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.