Homeఆంధ్రప్రదేశ్‌YCP : *వైసిపి నేతకు తీవ్ర అనారోగ్యం.. స్పందించిన టిడిపి ఎమ్మెల్యే.. నేరుగా సీఎం సాయం!*

YCP : *వైసిపి నేతకు తీవ్ర అనారోగ్యం.. స్పందించిన టిడిపి ఎమ్మెల్యే.. నేరుగా సీఎం సాయం!*

YCP :  ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు సమూలంగా మారాయి. సిద్ధాంతపరంగా విభేదాలు కంటే.. వ్యక్తిగతంగానే ఎక్కువమంది విభేదించుకుంటున్నారు. ఎదురుపడినా పలకరించే పరిస్థితి లేదు. ఒక్క పార్టీ అధికారంలో ఉంటే మరో పార్టీ శ్రేణులపై కేసులు, దాడులు కొనసాగుతున్నాయి. కేసులతో ఉక్కు పాదం మోపుతున్నారు. అరెస్టులతో భయపెడుతున్నారు. అయితే గత కొంతకాలంగా ఏపీలో ఈ పరంపర కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప దాతృత్వం చాటారు. ఓ వైసిపి నేతకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పది లక్షల రూపాయలు విడుదల చేశారు. ఇప్పుడు ఇదే వైరల్ అవుతోంది.

* తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ
ఉమ్మడి అనంతపురం( Ananthapuram ) జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని బాల వెంకటాపురం గ్రామానికి చెందిన జిలాని బాషా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా మంచి గట్టి నాయకుడు కూడా. ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. దాదాపు ఓ 20 లక్షలు రూపాయలు అవసరం ఏర్పడింది ఆయన వైద్యానికి. కానీ జిలాని కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే. వైద్యం కోసం ఉన్న ఆస్తులను అమ్ముకున్నాడు. అందిన దగ్గర అప్పులు చేశాడు. స్థానిక టిడిపి నేతలను కూడా ఆశ్రయించాడు. తనకు సాయం చేయాలని కోరాడు. టిడిపి నేతలు సైతం కొంత మొత్తాన్ని సర్దుబాటు చేశారు.

Also Read : అంతన్నారు ఇంతన్నారు.. చివరకు తేలిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా!*

* స్పందించిన ఎమ్మెల్యే
అయితే జిలాని( Jilani ) ఆరోగ్య పరిస్థితిని టిడిపి నాయకులు స్థానిక టిడిపి ఎమ్మెల్యే అలిమినేని సురేంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంప్రదించారు. సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల అయ్యేలా చేయాలని సూచించారు. వెంటనే జిలానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పది లక్షల రూపాయల నగదు మంజూరు అయింది. సంబంధిత చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. దీంతో ఎమ్మెల్యే తో పాటు టిడిపి నేతలకు కృతజ్ఞతలు తెలిపింది జిలాని కుటుంబం.

* రాజకీయ ప్రత్యర్థికి సాయం
ప్రస్తుతం రాజకీయాలంటే( politics) ప్రత్యర్థులను వెంటాడడం అన్న పరిస్థితి నుంచి.. ఒక ప్రత్యర్థి నేతకు సాయం చేయడం నిజంగా శుభ పరిణామం. సీఎం రిలీఫ్ ఫండ్ తో విడుదలైన ఈ మొత్తం నగదుతో జిలాని ఆరోగ్యం కుదుటపడితే మాత్రం ఆయనకు పునర్జన్మే. అయితే గతంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టిడిపి శ్రేణులకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేది కాదు. కానీ ఈ విషయంలో సీఎం చంద్రబాబుతో పాటు టిడిపి శ్రేణులు ఉదారంగా వ్యవహరించడం మాత్రం ఆకట్టుకుంటోంది.

Also Read : వైసీపీలో అసంతృప్త స్వరాలు!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper