Allu Arjun Strict Rule: ప్రస్తుత జనరేషన్ కి సంబంధించిన సూపర్ స్టార్స్ నుండి ఒక్క సినిమా విడుదల అవ్వడానికి కనీసం రెండు నుండి మూడేళ్ళ సమయం పడుతుంది. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్ ‘ చిత్రం విడుదలై ఏడాది పూర్తి అయ్యింది. అదే విధంగా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం కూడా విడుదలై ఏడాది దాటింది. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ సినిమాలు ఇక వచ్చే ఏడాదే విడుదల కాబోతున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఈయన తన తదుపరి చిత్రాన్ని ఎప్పుడు మొదలు పెడుతాడో తనకే క్లారిటీ లేదు. ఇలా ఉంది స్టార్ హీరోల పరిస్థితి. కానీ ప్రభాస్ మాత్రం ఏడాదికి కచ్చితంగా మూడు సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి ‘రాజా సాబ్’ చిత్రాన్ని విడుదల చేసాడు. ఇదే ఏడాది లో ఆయన హను రాఘవపూడి తో చేస్తున్న ‘ఫౌజీ’ చిత్రాన్ని కూడా ఈ ఏడాది దసరాకి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు.
ఇలా ప్రభాస్ ఒక్కడే ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేయడానికి తనవైపు నుండి కృషి చేస్తున్నాడు , ఇప్పుడు ఆ జాబితాలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. ఇకపై ఏడాదికి కి ఎట్టిపరిస్థితిలోనూ తన నుండి రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇకపై తనతో ఏ దర్శకుడు అయినా సినిమా చెయ్యాలంటే , 200 రోజుల వర్కింగ్ డేస్ లోపే తన క్యారక్టర్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చెయ్యాలి. అంతకు మించి దాటిందంటే మాత్రం, ఆయన వేరే ప్రాజెక్ట్ ని సమాంతరంగా మొదలు పెడుతాడట. ఏ డైరెక్టర్ కి అయినా ఆయన ఈ రూల్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వబోతున్నాడట , అది రాజమౌళి అయినా సరే.
ప్రస్తుతం ఆయన ‘రాకా’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబై లో సాగుతోంది. ఈ చిత్రం తర్వాత ఆయన లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అక్టోబర్ నుండి మొదలు పెట్టే ప్లాన్ లో ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన బసిల్ జోసెఫ్ అనే మలయాళం డైరెక్టర్ తో ఒక చిత్రం చేయబోతున్నాడు. వీళ్లంతా ఆయన నిర్దేశించిన సమయం లోపే తన పార్ట్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేయాలట. లేదంటే ప్రభాస్ పద్దతిని అనుసరిస్తాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ‘రాకా’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
