Homeఎంటర్టైన్మెంట్Toxic Movie Delay: మరోసారి వాయిదాపడిన 'టాక్సిక్' చిత్రం..అందుకు ప్రధానమైన 2 కారణాలు ఇవే..

Toxic Movie Delay: మరోసారి వాయిదాపడిన ‘టాక్సిక్’ చిత్రం..అందుకు ప్రధానమైన 2 కారణాలు ఇవే..

Toxic Movie Delay: కింగ్ స్టార్ యాష్(Rocking Star Yash) హీరో గా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్'(Toxic Movie) గత నెల 19 న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల , ఈ చిత్రం జూన్ 4 కి వాయిదా పడింది. ఎందుకంటే హీరో యాష్ ఎందుకో మూవీ ఔట్పుట్ పై పూర్తి స్థాయి సంతృప్తి లో లేడు , అందుకే కొన్ని […]

Toxic Movie Delay: కింగ్ స్టార్ యాష్(Rocking Star Yash) హీరో గా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్'(Toxic Movie) గత నెల 19 న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల , ఈ చిత్రం జూన్ 4 కి వాయిదా పడింది. ఎందుకంటే హీరో యాష్ ఎందుకో మూవీ ఔట్పుట్ పై పూర్తి స్థాయి సంతృప్తి లో లేడు , అందుకే కొన్ని సన్నివేశాలను రీ షూట్ చెయ్యాల్సిన అవసరం కచ్చితంగా ఉండడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేయక తప్పలేదు. అయితే ఈ సినిమాని ఇప్పుడు జూన్ 4 న కూడా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధంగా లేరట. అందుకు ప్రధానంగా రెండు బలమైన కారణాలు వినిపిస్తోంది. మొదటి కారణం షూటింగ్. కొన్ని సన్నివేశాలు ఏవైతే రీ షూట్ చెయ్యాలని అనుకున్నారో , అవి ఇంకా పూర్తి కాలేదట.

ఈ చిత్రం లో పనిచేసిన ఆర్టిస్టులు వేరే ప్రాజెక్ట్స్ కి షిఫ్ట్ అయ్యి ఫుల్ బిజీ అవ్వడం తో, వాళ్ళ డేట్స్ క్లాష్ వస్తుండడం వల్ల అనుకున్న సమయానికి షూటింగ్ ని జరపలేకపోతున్నారట. ఇక ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘జన నాయగన్ ‘ కారణంగా ఈ సంస్థ ఇప్పుడు పీకల్లోతు ఆర్ధిక నష్టాల్లో మునిగిపోయింది. అందుకే ఈ సినిమా బిజినెస్ విషయం లో ఎక్కడా వెనకడుగు వేయడానికి ఆ సంస్థ ఇష్టపడడం లేదు. అందులో భాగంగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని 250 కోట్ల రూపాయలకు అమ్మాలని చూస్తున్నారు. కానీ ప్రస్తుత ఓటీటీ మార్కెట్ బాగా పడిపోయింది. ‘స్పిరిట్’ లాంటి చిత్రాన్నే 150 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక ‘టాక్సిక్’ ని 250 కోట్లకు ఎలా కొంటారు చెప్పండి. నెట్ ఫ్లిక్స్ సంస్థ అయితే 110 కోట్ల రూపాయలకు కొనడానికి సిద్ధంగా ఉన్నారట. మేకర్స్ డిమాండ్ చేస్తున్న ప్రైజ్ కావాలంటే మాకు ముందుగా సినిమాని చూపించాల్సి ఉంటుందని ఒక షరతు పెట్టారట.

ఆ షరతు కి హీరో యాష్ అసలు ఒప్పుకోవడం లేదట. ఇది ఓటీటీ లో చూస్తే నచ్చే సినిమా కాదని , థియేట్రికల్ అనుభూతి పొందితేనే హై వస్తుందని, అలాంటి సినిమాని ముందుగా ఓటీటీ సంస్థలకు చూపించడం తనకు ఇష్టం లేదని చెప్పడం తో , ఈ సినిమా ఓటీటీ రైట్స్ డీల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఈ రెండు కారణాల చేతనే ఈ సినిమాని మరోసారి వాయిదా వెయ్యాల్సి వస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ ఈ చిత్రం జూన్ 4 న వాయిదా పడితే, డిసెంబర్ వరకు విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . మరి అప్పటి వరకు వాయిదా పడితే , ఈ సినిమాపై ఉన్న బజ్ మొత్తం నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి , మరి ఏమి చేయబోతున్నారో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper