Uttarakhand : ఉత్తరాఖండ్.. అది దేవభూమి.. ఎన్నో దేవాలయాలకు.. మరెన్నో నదులకు ఆ ప్రాంతం ఆలవాలం. హరిద్వార్ నుంచి మొదలు పెడితే ఎన్నో విశిష్టమైన క్షేత్రాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో ప్రస్తుతం విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగానే ఉత్తరాఖండ్ ప్రాంతంలో విస్తారంగా వర్షపాతం నమోదు అవుతుంది. ఈ ప్రాంతంలోనే గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. హరిద్వార్ ప్రాంతంలో ప్రవహించే ఈ నదిని చూసేందుకు, హరిద్వార్ క్షేత్రాన్ని సందర్శించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాదిమందిగా పర్యాటకులు వస్తూ ఉంటారు. అలా వచ్చిన పర్యాటకుల్లో ఓ భక్తుడు గంగానది ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అయితే అతడిని జవాన్లు ప్రాణాలకు తెగించి రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ ప్రాంతాన్ని సందర్శించేందుకు శివ భక్త్ అనే భక్తుడు వచ్చాడు. హరిద్వార్ క్షేత్రంలో పూజలు చేసిన తర్వాత గంగా నదిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. అయితే గత కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద కారణంగా గంగానది ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో శివ భక్త్ ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అతడు స్నానం చేస్తున్న సమయంలో లోతు అంచనా తెలియక లోపలికి దిగాడు. అంతే ఆ నది ప్రవాహానికి ఒక్కసారిగా కొట్టుకుపోవడం మొదలుపెట్టాడు. అతడు కేకలు వేయడంతో జవాన్లు రంగంలోకి దిగారు.. శివ భక్త్ స్నానం చేసేందుకు దిగిన కంగ్రా ఘాట్ లో లోతు ఎక్కువగా ఉంటుంది. అది గమనించక అతడు లోపలికి దిగడంతో.. కొట్టుకుపోయాడు. వాస్తవానికి అక్కడ ఉత్తరఖాండ్ ప్రభుత్వం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ అతడు ఏమాత్రం లెక్కచేయకుండా అందులోకి దిగాడు. అందువల్లే అతడు కొట్టుకుపోయాడని జవాన్లు పేర్కొన్నారు.
గంగకు ఎదురీది..
శివ భక్త్ కొట్టుకుపోతుండడాన్ని చూసి ఎస్ డి ఆర్ ఎఫ్ జవాన్లు శుభం, అసిఫ్ గంగకు ఎదురీదారు. ప్రాణాలకు ముప్పని తెలిసినప్పటికీ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. వెంటనే అతడిని అత్యంత చాకచక్యంగా కాపాడారు. ఒడ్డుకు తీసుకొచ్చి ప్రధమ చికిత్స చేసిన అనంతరం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో శివ కోలుకుంటున్నాడు. “ఆ సమయంలో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. అతడి ప్రాణాలు కాపాడాలని మేం భావించాం. ఆ సమయంలో ఏం జరిగినా పర్వాలేదనుకున్నాం. ఆ సమయంలో శివ ప్రాణాలు కాపాడటమే మా ప్రధాన లక్ష్యంగా ఉంది. ఏదైనా సరే అతడిని ఒడ్డుకు చేర్చాలని భావించాం. దేవుడి దయవల్ల అతడి ప్రాణాలు కాపాడగలిగాం. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని” జవాన్లు పేర్కొన్నారు. కాగా జవాన్లు ప్రాణాలకు తెగించి శివను కాపాడిన తీరును నెటిజన్లు కొనియాడుతున్నారు. కొందరు జవాన్లు ఈదుతున్న సమయంలో దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో మిలియన్ల వ్యూస్ నమోదు చేసుకుంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో వరదలు సంభవించినప్పుడు పలువురు భక్తులు ఇలాగే కొట్టుకుపోయారు. ఆ సమయంలో జవాన్లు రక్షణ చర్యలు చేపట్టారు. పలువురు భక్తులను కాపాడారు. కొన్నిసార్లు కొండ చరియలు విరిగిపడటంతో పలువురు భక్తులు మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే హరిద్వార్ ప్రాంతం హిమాలయాలకు దగ్గరగా ఉండడంతో ప్రతి ఏడాది అక్కడ విపరీతమైన వర్షపాతం నమోదవుతుంది. గంగ నుంచి మొదలుపెడితే అనేక నదులు, ఉపనదులు ప్రమాదకరస్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటాయి.
हरियाणा निवासी शिवभक्त #haridwar स्थित कांगड़ा घाट पर नहाने के दौरान गंगा के तेज बहाव में बहने लगा। इसी दौरान वहां मौजूद #UttarakhandPolice के गोताखोर सन्नी कुमार और SDRF जवान शुभम व आसिफ ने कड़ी मशक्कत के बाद सकुशल बचा लिया।#KanwarYatra2024 pic.twitter.com/CEVnbKXrCK
— Uttarakhand Police (@uttarakhandcops) July 22, 2024