spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu Telangana visit: తెలంగాణలో చంద్రబాబు.. ఇంతకంటే ఏం కావాలి

Chandrababu Naidu Telangana visit: తెలంగాణలో చంద్రబాబు.. ఇంతకంటే ఏం కావాలి

Chandrababu Naidu Telangana visit: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్. ప్రధాని నరేంద్ర మోడీతో సమకాలీకులు. ఆయన కంటే ముందుగానే ముఖ్యమంత్రి అయ్యారు. ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు చంద్రబాబు. ఎన్నెన్నో సంక్షోభాలను దాటుకొని ఈ స్థాయికి ఎదిగారు. అయితే ఆయనకు ఒక లోటు ఉంది. తెలంగాణ సమాజంలో ఆయన వ్యతిరేకిగా ముద్రపడ్డారు. అలా ముద్ర వేసింది కేసీఆర్. తెలంగాణ సమాజంలో ఒక విలన్ గా చిత్రీకరించారు. చివరకు ఆయన ద్వారా రాజకీయ లబ్ధి పొందిన నేతలు సైతం ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోయారు. చివరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్ధకంగా మారింది. తెలంగాణ ప్రజల గుండెల్లో ఒక విష బీజం నింపారు చంద్రబాబుపై. అయితే ఇప్పుడిప్పుడే అక్కడి ప్రజలతో పాటు నేతలు వాస్తవాలు గుర్తిస్తున్నట్టున్నారు. అందుకే చంద్రబాబు విషయంలో వారు ఆలోచన మార్చుకున్నారు. నేతలు ఏ నోటితో తిట్టారో.. ఇప్పుడు వారే చంద్రబాబు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వైరల్ అంశంగా మారింది.

టిడిపి పై ముద్ర..
తెలుగుదేశం( Telugu Desam) పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు. కానీ ఆయన కంటే టిడిపి పై చంద్రబాబు ముద్ర అధికం. ఆ పార్టీ అధినేతగా దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా వ్యవహరించారు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా.. నవ్యాంధ్రప్రదేశ్ కు ఏడేళ్ల ముఖ్యమంత్రిగా.. అంతకుమించి ప్రతిపక్ష నేతగా అనుభవం చంద్రబాబుది. అయితే తెలంగాణ వ్యతిరేక ముద్ర అనేది చంద్రబాబుపై ఒక పద్ధతి ప్రకారం మోపడంలో సక్సెస్ అయ్యారు కెసిఆర్. తెలుగుదేశం పార్టీ నేతలను ఆకర్షించారు కూడా. అయితే చంద్రబాబు పట్ల కృతజ్ఞత ఉన్నా రాజకీయ భవిష్యత్తు కోసం చాలామంది నేతలు తెలుగుదేశం పార్టీని వీడారు. గులాబీ పార్టీలో చేరి పెద్ద పదవులు అనుభవించారు. కానీ వారు ఎవరు చంద్రబాబు నాయకత్వాన్ని మరిచిపోలేకపోయారు. అంతలా ముద్ర వేశారు ఏపీ సీఎం చంద్రబాబు.. పార్టీ పరంగా చంద్రబాబును విభేదించేవారు వ్యక్తిగతంగా మాత్రం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే అది ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.

చంద్రబాబు కాలికి నమస్కారం..
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్( Bandla Ganesh) కుమార్తె వివాహ నిశ్చితార్థం నిన్ననే జరిగింది. కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. అయితే ఇదే వేడుకలకు గులాబీ పార్టీ నేతలతో పాటు తెలంగాణలో వివిధ పార్టీల్లో ఉన్న నాయకులు హాజరయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎదురుపడ్డారు. వినమ్రతతో కాలికి నమస్కరించారు. అటు తర్వాత మైనంపల్లి హనుమంతరావు కూడా కాలికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు చంద్రబాబు నుంచి. వారిద్దరే కాదు చాలామంది నాయకులు అలానే చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు విషయంలో తెలంగాణ సమాజంలో మార్పు వచ్చిందనడానికి ఈ వీడియోలే సాక్ష్యం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Oktelugu Epaper
Exit mobile version