Homeఎంటర్టైన్మెంట్బ‌న్నీతో కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ‘తీన్ మార్‌’!

బ‌న్నీతో కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ‘తీన్ మార్‌’!

ఇప్పుడు కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఒకే ఒక్క సినిమాతో యావ‌త్ భార‌త సినీ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసిన‌ ప్ర‌శాంత్‌.. క్రేజీ కాంబోల‌ను అనౌన్స్ చేస్తూ మంట‌లు రేపుతున్నాడు. కేజీఎఫ్‌-2 ఫినిష్ చేయ‌గానే.. ప్రభాస్ తో ‘స‌లార్’ మొదలు పెట్టేసి అబ్బుపరిచాడు. ఇప్పుడు ఆ సినిమా శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. Also Read: టీవీ టిక్కెట్టుః RRR 200 కోట్లు, వీరమల్లు 150 కోట్లు! ఈ సినిమా పూర్త‌యిపోగానే.. వెంట‌నే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో […]

allu arjun prashanth neel
ఇప్పుడు కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఒకే ఒక్క సినిమాతో యావ‌త్ భార‌త సినీ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసిన‌ ప్ర‌శాంత్‌.. క్రేజీ కాంబోల‌ను అనౌన్స్ చేస్తూ మంట‌లు రేపుతున్నాడు. కేజీఎఫ్‌-2 ఫినిష్ చేయ‌గానే.. ప్రభాస్ తో ‘స‌లార్’ మొదలు పెట్టేసి అబ్బుపరిచాడు. ఇప్పుడు ఆ సినిమా శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది.

Also Read: టీవీ టిక్కెట్టుః RRR 200 కోట్లు, వీరమల్లు 150 కోట్లు!

ఈ సినిమా పూర్త‌యిపోగానే.. వెంట‌నే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో సినిమాను లైన్లో పెట్ట‌నున్నాడు. స‌లార్ ను వ‌చ్చే ఏడాది సమ్మ‌ర్ కు స్లాట్ బుక్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ వెంట‌నే తార‌క్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అది పూర్తికాగానే మ‌రో క్రేజీ స్టార్ తో సినిమా తీయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది.

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ప్ర‌శాంత్ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని, ఎన్టీఆర్ మూవీ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ టేక‌ప్ చేసే ప్రాజెక్టు బ‌న్నీదే అన్న డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. అయితే.. ఇది ఎవ‌రో చెప్తే గాలి వార్త అనుకునేవాళ్లు కానీ.. అల్లు అర్జున్ కు రైట్ హ్యాండ్ గా ఉన్న బ‌న్నీవాసు ప్ర‌క‌టించ‌డంతో అటెన్ష‌న్ క్రియేట్ అయ్యింది.

Also Read: వ‌కీల్ సాబ్ ప్రెజర్ః ప‌వ‌న్‌ ను లాక్ చేసేందుకు తెగ ట్రై చేస్తున్న నిర్మాత‌!

గీతా ఆర్ట్స్ కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్నీ బ‌న్నీవాసు చూస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌నే ప్ర‌శాంత్ నీల్‌-బ‌న్నీ కాంబోలో సినిమా అని ధృవీక‌రించ‌డంతో ఈ ప్రాజెక్టు ఫైన‌ల్ అయిపోయింద‌ని క్లారిటీ వ‌చ్చేసింది. కేజీఎఫ్ చిత్రీక‌ర‌ణ టైం నుంచే ప్ర‌శాంత్ తో అల్లు అర్జున్ ట‌చ్ లో ఉన్నాడ‌ట‌. ఆ స‌మ‌యంలో బ‌న్నీతో సినిమా చేస్తాన‌ని చెప్పాడ‌ట ద‌ర్శ‌కుడు.

ఇప్పుడు ఇదే విష‌యాన్ని బ‌న్నీవాసు క‌న్ఫాం చేయ‌డంతో ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌డం ఖాయం అని తేలిపోయింది. పుష్ప కంప్లీట్ అయిన త‌ర్వాత బ‌న్నీ కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాతే.. ఈ ప్రాజెక్టు ఎప్పుడనే విష‌యంపై క్లారిటీ రావొచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper