Runa Mafi: రేవంతూ.. పంట రుణాలపై ఈ మెలికలు ఏంటి సారూ..?

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం చిన్న, సన్నకారు రైతులకే వర్తింపజేస్తోంది. ఇదే తరహాలో రైతు భరోసా, పంట రుణాల మాఫీ పథకం వర్తింపజేయాలని సీఎం సూచించారు.

Written By: Raj Shekar, Updated On : June 13, 2024 10:22 am

Runa Mafi

Follow us on

Runa Mafi: పంద్రాగస్టు నాటికి పంట రుణాలు మాఫీ చేస్తామని ఛాలెంజ్‌ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీకి సకరత్తు మొదలు పెట్టారు. ఆగస్టు 15 నాటికి పంట రుణాల మాఫీకి అవసరమైన నిధుల సమీకరణలో నిమగ్నమయ్యారు. శాఖల వారీగా సమీక్ష చేస్తూ.. నిధులు ఖజానాలో జమ చేయిస్తున్నారు.

కండీషన్స్‌ అప్లయ్‌..
ఇదిలా ఉంటే.. పంట రుణామా మాఫీకి రేవంత్‌ సర్కార్‌ కొన్ని షరతులు విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పంటలు సాగుచేస్తున్న రైతులకు, ఆర్థికంగా వెనుకబడిన రైతులకు మాత్రమే పంట రుణాలు మాఫీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే రైతు భరోసా స్కీం పంటలు సాగుచేస్తున్న రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈక్రమంలో పంట రుణాల మాఫీకి కూడా ఇదే ఫార్ములా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో అందరికీ రుణమాఫీ, రైతుబంధు..
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణమాఫీ, రైతుబంధు పథకాలను అందరికీ వర్తింపజేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, బడా లీడర్లు, వందల ఎకరాల భూములు ఉన్నవారికి కూడా వర్తింపజేశారు. దీనిపై విమర్శలు వచ్చాయి.

అసలైన రైతులకే..
ఇక ప్రభుత్వం మారింది. దీంతో రైతుబంధు స్థానంలో రైతు భరోసా తీసుకొచ్చారు. అసలైన రైతులకు మాత్రమే దీనిని అమలు చేయాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లించేవారు, ప్రజాప్రతినిధులకు రైతు భరోసా ఇవ్వకూడాదని భావిస్తున్నారు. రుణమాఫీ విషయంలో కూడా దీనినే వర్తింపజేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు విధి విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

పీఎం కిసాన్‌ నిధి తరహాలో..
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం చిన్న, సన్నకారు రైతులకే వర్తింపజేస్తోంది. ఇదే తరహాలో రైతు భరోసా, పంట రుణాల మాఫీ పథకం వర్తింపజేయాలని సీఎం సూచించారు. ఈమేరకు అధికారులు ఐటీ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యాంగబద్దమైన పదవుల్లో కొనసాగుతోన్న వారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

15 లేదా 18న మంత్రిర్గ భేటీ..
రుణమాఫీ అంశంపై కేబినెట్‌ లో చర్చించి తుది నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. ఈమేరకు ఈనెల 15 లేదా 18 తేదీన కేబినెట్‌ భేటీ నిర్వహించే ఆలోచనలో రేవంత్‌ సర్కార్‌ ఉంది. రుణమాఫీ అమలుకు అవసరమై నిర్ణయాపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.