https://oktelugu.com/

Pushpa 2 The Rule Trailer : పుష్ప ఏం రౌద్రం రా స్వామి.. నరాలు కట్ అయిపోయాయి.. అల్లు అర్జున్ యాక్షన్ కి మరో నేషనల్ అవార్డు గ్యారంటీ!

పుష్ప పార్ట్ 1 మొత్తం హీరోయిజం మీదనే కథ నడిచింది. కానీ పుష్ప 2 లో ఎమోషన్స్, సెంటిమెంట్, వేరే లెవెల్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. బాహుబలి 2 , కేజీఎఫ్ చాప్టర్ 2 వంటి సినిమాలు నార్త్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి అసలు కారణం ఎమోషన్స్ పండడం వల్లనే

Written By:
  • NARESH
  • , Updated On : November 17, 2024 / 08:51 PM IST

    Allu Arjun

    Follow us on

    Pushpa 2 The Rule Trailer ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలై బంపర్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ ట్రైలర్ క్వాలిటీ ని చూసి డైరెక్టర్ సుకుమార్ ని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు ఫ్యాన్స్. అయితే అల్లు అర్జున్ తన ప్రతీ సినిమాలోనూ నటన పరంగా నూటికి నూరు మార్కులు పడేలా చేసుకుంటాడు. సినిమా ఎలా ఉన్నా కూడా, తన అద్భుతమైన నటనతో జనాలను సీట్స్ లో కూర్చోబెట్టి సినిమా చూపించడం ఆయనకీ వెన్నతో పెట్టిన విద్య. పుష్ప సినిమాలో అలా చేసినందుకే ఆయనకి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వచ్చేలా చేసింది. ఇప్పుడు పుష్ప 2 చిత్రంతో రెండవసారి నేషనల్ అవార్డుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. ట్రైలర్ ని చూస్తుంటే సుకుమార్ అల్లు అర్జున్ లోని ది బెస్ట్ ని లాగేశాడని అర్థం అవుతుంది.

    పుష్ప పార్ట్ 1 మొత్తం హీరోయిజం మీదనే కథ నడిచింది. కానీ పుష్ప 2 లో ఎమోషన్స్, సెంటిమెంట్, వేరే లెవెల్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. బాహుబలి 2 , కేజీఎఫ్ చాప్టర్ 2 వంటి సినిమాలు నార్త్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి అసలు కారణం ఎమోషన్స్ పండడం వల్లనే. పుష్ప 2 లో కూడా అవి పుష్కలంగా పెట్టినట్టు ఆ ట్రైలర్ ని చూస్తేనే అర్థం అవుతుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించే హీరోలలో ఒకడు అల్లు అర్జున్. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక చనిపోతుంది. ఆమె శవాన్ని ఎర్ర చందనం కట్టలతో కాల్చడం మనం ట్రైలర్ లో గమనించొచ్చు. ఈ సన్నివేశం లో అల్లు అర్జున్ ఎమోషనల్ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉండబోతుంది అని ఆశించవచ్చు. అదే విధంగా పోర్ట్ లో అల్లు అర్జున్ విలన్స్ తో చేసే పోరాట సన్నివేశం కూడా అద్భుతంగా వచ్చినట్టు తెలుస్తుంది.

    ఈ సన్నివేశాలు అన్నిట్లో అల్లు అర్జున్ స్టైల్, స్వాగ్, యాటిట్యూడ్ ని ఒక రేంజ్ లో వాడినట్టు ఉన్నాడు సుకుమార్. ట్రైలర్ చివర్లో అల్లు అర్జున్ ఆవేశం తో పుర్రెల మాల మెడలో వేసుకొని తగ్గేదేలే అంటూ చెప్పే డైలాగ్ వేరే లెవెల్ లో ఉంది. యాక్షన్ తో పాటు కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాలో అల్లు అర్జున్ నుండి బాగా లాగినట్టు ఉన్నాడు సుకుమార్. విలన్ ఫహద్ ఫాజిల్ తో కూడా ఆయన అనేక కామెడీ సన్నివేశాలు చేయించినట్టు ఈ ట్రైలర్లో కనిపిస్తుంది. ఓవరాల్ గా అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని ప్రతీకగా పుష్ప 2 ట్రైలర్ ఉంది. చూడాలి మరి సినిమాలో ఆయన ఇంకా ఏ రేంజ్ లో రెచ్చిపోయి తనలోని నట విశ్వరూపాన్ని బయటకి తీసాడు అనేది.