Rajamouli
Rajamouli : సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు వరుస విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాని శాసించే స్థాయికి ఎదిగింది. రాజమౌళి లాంటి దర్శకుడు బాహుబలి(Bahubali) సినిమా చేయడంతో తెలుగు సినిమా స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. తద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాలను బీట్ చేసే సినిమా మరొకటి లేదు అనేంతలా గుర్తింపును కూడా సంపాదించుకున్నాయి…ఇండియాలో ఎంత మంది దర్శకులు ఉన్న రాజమౌళి మాత్రం చాలా ప్రత్యేకం అనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి…చాలా తక్కువ సమయంలోనే దర్శక ధీరుడి గా మారడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాశించే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… ప్రపంచవ్యాప్తంగా అతనికి చాలామంది అభిమానులు ఉన్నారు. మరి మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాతో హాలీవుడ్ లో కూడా అతని పేరు మారుమ్రోగబోతుందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో భారీ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టాయి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన లాంటి దర్శకుడు ఎవరు లేరు అనేంతల మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో ప్రపంచంలో సైతం ఒక దిగ్గజ దర్శకుడిగా ఎదిగాలని చూస్తున్నాడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందుకున్నాడు.
Also Read : రాజమౌళి చేసిన సినిమాల్లో తన భార్య కి నచ్చిన సినిమాలు ఇవేనా..?
కానీ ఇండస్ట్రీ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు.మగధీర (Magadheera) సినిమాతో ఆయన కోరిక నెరవేరింది. ఇక తనతో పాటే కెరియర్ ని స్టార్ట్ చేసిన పూరి జగన్నాథ్ మాత్రం (Pokiri) సినిమాతోనే ఇండస్ట్రీ అందుకున్నాడు. రాజమౌళి కంటే ముందే ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడిగా మంచి పేరు దక్కించుకొని తెలుగులో నెంబర్ వన్ దర్శకుడిగా గుర్తింపును పొందాడు.
ప్రస్తుతం ఆయన తన ఫామ్ ను అందుకోలేకపోతున్నప్పటికి ఆయన నుంచి సినిమా వచ్చిందంటే చాలు చాలామంది అభిమానులు ఆ సినిమాను చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మగధీర సినిమా తర్వాత రాజమౌళి చేసిన ప్రతి సినిమా సక్సెస్ ని సాధించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకొని ముందుకు సాగినవే కావడం విశేషం…అలాగే తన ఫేవరెట్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ సరసన అతని పేరు నిలుపుకోవాల ఉద్దేశ్యం తోనే రాజమౌళి అహర్నిశలు కష్టపడుతూ పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సైతం సిద్ధపడ్డాడు…
Also Read : ఏడాది నుండే మహేష్ ,రాజమౌళి సినిమా షూటింగ్ జరుగుతుందా..ఇదేమి ట్విస్ట్!