Allu Arjun and Atlee : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ‘పుష్ప 2′(Pushpa 2 Movie) లాంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి త్రివిక్రమ్(Trivikram Srinivas) తో కాగా, మరొకటి తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ(Director Atlee) తో. వీళ్ళిద్దరిలో ఎవరితో ఆయన ముందుగా సినిమా చేయబోతున్నాడు అనేది నిన్న మొన్నటి వరకు సస్పెన్స్ గా ఉండేది. కానీ ఇప్పుడు అట్లీ తో చేయబోయే సినిమానే ముందుగా ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. ఉగాదికి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు రానుంది. అయితే సోషల్ మీడియా లో ఈ సినిమాకు సంబంధించి రోజుకు ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వస్తున్నా సంగతి తెలిసిందే. ఇది సింగల్ స్టార్రర్ సినిమా కాదని, మల్టీ స్టార్రర్ అని, సూపర్ స్టార్ రజినీకాంత్ మరో హీరో గా నటించబోతున్నాడని ఒక ప్రచారం జరిగింది.
Also Read : జీవితంలో మహేష్ బాబుతో నటించకూడదని ఫిక్స్ అయిన సౌందర్య.. కారణం ఏమిటో తెలుసా?
అదే విధంగా ఈ సినిమాలో తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న మరో వార్త ఏమిటంటే, ఈ సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5 మంది హీరోయిన్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ముగ్గురు హీరోయిన్స్ ని ఇప్పటికే ఖరారు చేసారని, వారిలో పాన్ ఇండియా స్థాయి లో ఇమేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. 5 మంది హీరోయిన్స్ ని పెట్టుకోవాల్సినంత అవసరం ఎం ఉంది?, అసలు ఏమి ప్లాన్ చేస్తున్నారు?, ఏ జానర్ మీద ఈ సినిమా తెరకెక్కుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అనొచ్చు. అట్లీ అంటే కచ్చితంగా కమర్షియల్ సినిమానే అయ్యుంటాది. ఆయన కమర్షియల్ సినిమాలు ఎలా ఉంటాయో మనకి ఒక ఐడియా ఉంది. సమాజం లోని బర్నింగ్ టాపిక్ ని కథాంశం గా తీసుకొని, దానికి పర్ఫెక్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడిస్తాడు.
అంటే అట్లీ మోడరన్ ఏజ్ శంకర్ అన్నమాట. అల్లు అర్జున్ తో తీయబోయే సినిమా కూడా అదే ఫార్మటు లో ఉండబోతుందా అనే విషయం తెలియాల్సి ఉంది. మరో విశేషం ఏమిటంటే, ఈ చిత్రాన్ని కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. ఈ సినిమా తర్వాత వెంటనే అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ కి షిఫ్ట్ అవ్వబోతున్నారు. త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా మన మైథాలజీ కి సంబంధించినది. శివ పార్వతుల తనయుడు, యుద్ధాలకు రారాజు కార్తికేయ స్వామి జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమాకు దాదాపుగా 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ అవసరం అవుతుందని అంటున్నారు. త్రివిక్రమ్ కెరీర్ లోనే కాదు, అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా అనొచ్చు. స్క్రిప్ట్ కి ఇంకా సమయం అవసరం ఉన్నందున ముందుగా అట్లీ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నాడు.
Also Read : బిగ్ బాస్ 9 హోస్ట్ గా విజయ్ దేవరకొండ.. తన ఒపీనియన్ చెప్పిన రౌడీ హీరో!