Allu Arjun and Atlee : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్లు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తమకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు… స్టార్ హీరోలైతే భారీ విజయాలను సాధించడానికి విపరీతంగా కష్టపడుతున్నారు… పాన్ ఇండియా సినిమాలను చేసి సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు…
పుష్ప 2 (Pushpa 2) సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న నటుడు అల్లు అర్జున్… ఈ సినిమా1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడంతో అప్పటివరకు ఉన్న బాహుబలి రికార్డులను బ్రేక్ చేశాడు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన హీరోగా తన పేరును చిరస్మరణీయంగా నిలుపుకున్నాడు. మరి ఇలాంటి అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేస్తున్నాడనే అనుమానులైతే ప్రతి ఒక్క అభిమానిలో ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అట్లీ (Atlee) డైరెక్షన్ లో అల్లు అర్జున్ (Allu Arjun) ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవాలనే లక్ష్యంతో ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలతో యావత్ తెలుగు సినిమా స్థాయిని సైతం మరొక మెట్టు పైకి ఎక్కిస్తూ వస్తున్నాడు. మరి ఇలాంటి అల్లు అర్జున్ ఫ్యూచర్ లో చేయబోయే సినిమాలతో కూడా పెను ప్రభంజనాలను సృష్టిస్తే ఆయన ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Also Read : అల్లు అర్జున్ అట్లీ తో చేస్తున్న సినిమా పునర్జన్మల కాన్సెప్ట్ తో వస్తుందా..?
ఇక అట్లీ డైరెక్షన్ లో ఈయన చేస్తున్న సినిమాలో ఈయన డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందులో ఒక పాత్ర విలన్ కాగా, మరొక పాత్ర హీరోగా చేస్తున్నారట. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అనేది అల్లు అర్జున్ కి చాలా కీలకంగా మారబోతుంది.
ఎందుకంటే ఇప్పటివరకు ఆయన వరుసగా హ్యాట్రిక్ విజయాలను సాధించాడు. ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకొని తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. మరి ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి దర్శకులు కూడా ఆ సినిమాలను తెరకెక్కించడంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది.
ఇక అల్లు అర్జున్ తన సినిమా కోసం ఏ రేంజ్ కష్టపడతాడో మనందరికీ తెలిసిందే. ఫైట్స్ చేయడంలో గాని, డ్యాన్స్ వేయడంలో గాని ఆయనకు ఆయనే పోటీ అనే రేంజ్ లో భారీ గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల్లో ఇవన్నీ ఉండే విధంగా చూసుకుంటాడు…ఇక అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాను మే నెల నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : కెరీర్ లో తొలిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్న అల్లు అర్జున్..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!