Buchi Babu vs Srikanth Odela : ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలందరు వాళ్ళకంటూ సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇక దానికి అనుగుణంగానే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొదటి స్థానంలో ఉంది. కాబట్టి మన హీరోలందరూ నెంబర్ వన్ హీరోగా ఎదగడానికి తీవ్రమైన ప్రయత్నాలైతే చేస్తున్నారు. దర్శకులు సైతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుండటం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సుకుమార్ లాంటి దర్శకుడు చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. సుకుమార్(Sukumar) శిష్యుడు అయిన బుచ్చిబాబు (Buchhi Babu) చేసిన పుష్ప సినిమా అతనికి ఎనలేని గుర్తింపును తీసుకువచ్చింది. ఈ సినిమాతోనే 100 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశారనే చెప్పాలి… ప్రస్తుతం ఆయన రామ్ చరణ్(Ram Charan) తో చేస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా బుచ్చిబాబు ఎలాంటి డైరెక్టర్ గా మారబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ సాధిస్తే బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ గా మారిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక సుకుమార్ మరోక శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)సైతం ప్రస్తుతం నాని(Nani) తో ‘ది ప్యారడైజ్’ (The Paradaise) అనే సినిమాని ప్రతి చేస్తున్నాడు.
Also Read : తనతో సినిమా చేయడం లేదని డైరెక్టర్ బుచ్చిబాబు ను స్విమ్మింగ్ పూల్ లోకి విసిరేసిన స్టార్ హీరో… వీడియో వైరల్…
ఇంతకు ముందు నానితో చేసిన దసర (Dasara) సినిమా భారీ విజయాని అందుకోవడమే కాకుండా మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్లో చేరిన దర్శకుడిగా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాతో మరోసారి తన సంచలనాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక ఇప్పుడు బుచ్చిబాబు శ్రీకాంత్ ఓదెల మధ్య భారీ పోటీ అయితే నెలకొంది. వాళ్లిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారు, ఎవరు సక్సెస్ ని సాధించి వాళ్ళ హవాని ఎక్కువగా కొనసాగిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.
రాబోయే రోజుల్లో స్టార్ డైరెక్టర్లు ఇద్దరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మాత్రం భారీగా పోటీ పడాల్సిన అవసరమైతే ఉంది. ఈ రెండు సినిమాలతో వీళ్ళలో టాప్ డైరెక్టర్ ఎవరు అనేది డిసైడ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమాలతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు తద్వారా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా లేదా అనేది…
Also Read : నానితో చేస్తున్న ప్యారడైజ్ సినిమా కోసం శ్రీకాంత్ ఓదెల ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?