https://oktelugu.com/

ట్రైల‌ర్‌ టాక్ : ‘నాంది’తోనే జీవితం మొదలైంది !

అల్లరి నరేష్ అంటే వరుస హిట్స్ కి కేరాఫ్ అడ్రెస్. కానీ, గత కొన్ని సినిమాలుగా హిట్ లేక సోలో హీరోగా మార్కెట్ లేక మొత్తానికి ఫుల్ డౌన్ ఫాల్ లో ఉన్నాడు అల్లరోడు. ప్రస్తుతం అల్లరి నరేష్ కొత్త సినిమా ‘నాంది’. కాగా తాజాగా ప్రిన్స్‌ మహేష్‌బాబు చేతుల మీదుగా నాంది మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. అయితే ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. “అందరూ నా జీవితం ఇక్కడ అయిపోయింది అని అనుకుంటారు.. కానీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 6, 2021 / 11:30 AM IST
    Follow us on


    అల్లరి నరేష్ అంటే వరుస హిట్స్ కి కేరాఫ్ అడ్రెస్. కానీ, గత కొన్ని సినిమాలుగా హిట్ లేక సోలో హీరోగా మార్కెట్ లేక మొత్తానికి ఫుల్ డౌన్ ఫాల్ లో ఉన్నాడు అల్లరోడు. ప్రస్తుతం అల్లరి నరేష్ కొత్త సినిమా ‘నాంది’. కాగా తాజాగా ప్రిన్స్‌ మహేష్‌బాబు చేతుల మీదుగా నాంది మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. అయితే ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. “అందరూ నా జీవితం ఇక్కడ అయిపోయింది అని అనుకుంటారు.. కానీ ఇప్పుడే మొదలైంది” అంటూ ట్రైలర్‌లో అల్లరి నరేష్‌ చెప్పిన డైలాగ్ బాగుంది.

    Also Read: రివ్యూ : జీ జాంబీ : కంటెంట్ పరంగా మెప్పిస్తోంది !

    అలాగే “ఇక్క‌డి చ‌ట్టాలు చేత‌కానివాడిపై వాడ‌డం కోస‌మే. ప‌వ‌ర్‌లో ఉన్న‌వాడ్ని ఏం పీక‌లేవు“ అనే డైలాగ్ తో పాటు లాయ‌ర్ గా శ‌ర‌త్ కుమార్ వ‌ర‌ల‌క్ష్మి నటించిన విధానం ఆకట్టుకుంది. ఇక కొత్త‌గా ఏదో చేయాల‌న్న త‌ప‌నతో న‌రేష్‌ ఈ సినిమా చేసినట్లు క‌నిపిస్తోంది. ముఖ్యంగా రాజ‌గోపాల్ అనే ఓ వ్య‌క్తి హ‌త్య‌కు గురవ్వడంతో మొదలైన ఈ ట్రైలర్ లో ఆ నేరం.. సూర్య ప్ర‌కాష్ (నరేష్) అనే అమాయ‌కుడి పై ప‌డుతుంది. ఐపీసీ సెక్ష‌న్లు, అందులోని లొసుగులూ.. ఈ అమాయ‌కుడ్ని ఎలా బ‌లిగొన్నాయి? అనేది తెర‌పై చూడాలి.

    Also Read: గోవాలో శ్రీముఖి రచ్చ: వాళ్లతో ఆ ఫొటోలు వదిలి షాకిచ్చిన యాంకర్

    కాగా అతి కష్టంమీద నరేష్ చేస్తోన్న ఈ ప్రయోగాత్మక సినిమాని జీ5 ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాది శాడ్ ఎండింగ్ అని.. బాగా ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్ చివర్లో అల్లరి నరేష్ పాత్ర చనిపోతుందని.. సెంటిమెంట్ పీపుల్స్ కి ఈ సినిమా ప్రత్యేకంగా కనెక్ట్ అవుతుందని సమాచారం. ఇందులో అల్లరి నరేష్ కాస్తా సీరియస్ లుక్‏లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    జైలు బ్యాక్ డ్రాప్‏లో ఉండనున్న ఈ మూవీని దర్శకుడు సతీష్ విగ్నేష్ నిర్మించడం ఇక్కడ మరో విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచింది.