https://oktelugu.com/

రివ్యూ : జీ జాంబీ : కంటెంట్ పరంగా మెప్పిస్తోంది !

రేటింగ్ : 2.5 కథ : ఓ మెడికల్ ప్రొఫెషనల్స్ టీం ఇమ్యూనిటీ బూస్టర్ వ్యాక్సిన్ లాంచ్ చేయాలని అనుకుంటుంది. దీనికోసం ఓ ఇంజినీరింగ్ కాలేజీలో పరిశోధనలు ప్రారంభిస్తుంది. క్లినికల్ ట్రయల్స్ కోసం జంతువులకు బదులుగా.. జీవితఖైదు పడిన క్రిమినల్స్ ని వినియోగిస్తారు. వ్యాక్సిన్ ఇచ్చాక అది ఫెయిల్ అవుతుంది. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు జాంబీలుగా మారతారు. తర్వాత, ఆ ఇన్ఫెక్షన్ అక్కడున్న ఇతరులకు వ్యాపిస్తుంది. అయితే.. డాక్టర్ రుద్ర, అతని గర్ల్ ఫ్రెండ్ సారా మరికొందరు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 6, 2021 / 11:18 AM IST
    Follow us on


    రేటింగ్ : 2.5

    కథ :
    ఓ మెడికల్ ప్రొఫెషనల్స్ టీం ఇమ్యూనిటీ బూస్టర్ వ్యాక్సిన్ లాంచ్ చేయాలని అనుకుంటుంది. దీనికోసం ఓ ఇంజినీరింగ్ కాలేజీలో పరిశోధనలు ప్రారంభిస్తుంది. క్లినికల్ ట్రయల్స్ కోసం జంతువులకు బదులుగా.. జీవితఖైదు పడిన క్రిమినల్స్ ని వినియోగిస్తారు. వ్యాక్సిన్ ఇచ్చాక అది ఫెయిల్ అవుతుంది. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు జాంబీలుగా మారతారు. తర్వాత, ఆ ఇన్ఫెక్షన్ అక్కడున్న ఇతరులకు వ్యాపిస్తుంది. అయితే.. డాక్టర్ రుద్ర, అతని గర్ల్ ఫ్రెండ్ సారా మరికొందరు ఎలా ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకున్నారు అనేదే స్టోరీ.

    Also Read: బాలయ్యకు కథ చెప్పిన ‘క్రాక్’ డైరెక్టర్ !

    విశ్లేషణ :

    సినిమా ప్రారంభంలో స్లోగా లవ్ ట్రాక్ తో మొదలైనా.. కాసేపట్లోనే రోలర్ కోస్టర్ లాగా థ్రిల్లింగ్ సీన్లతో పీక్స్ కు తీసుకెళ్తుంది. ఆర్యన్ గౌర, దీపు డైరెక్షన్ అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. మెస్మరైజింగ్ స్క్రీన్ ప్లేకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆర్యన్ గౌరాకు ఇది మొదటి మూవీ అయినా.. ఎక్కడా అది కనిపించదు. చాలా మెచూర్డ్ నటుడిగా రుద్ర క్యారెక్టర్ తో మెప్పించాడు. అద్భుతమైన ఎనర్జీ లెవల్స్ తో క్యారెక్టర్ కి పర్ ఫెక్ట్ గా న్యాయం చేశారు. మొత్తంగా జాంబీ మూవీ.. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉన్న ఓ గ్రేట్ మూవీ అనే చెప్పాలి.

    Also Read: ట్రైల‌ర్‌ టాక్ : ‘నాంది’తోనే జీవితం మొదలైంది !

    ప్లస్ పాయింట్స్ :

    ఆర్యన్ గౌర ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్
    ఎమోషనల్ సీన్లు
    ఆసక్తిరేకెత్తించే ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్

    మైనస్ పాయింట్స్ :

    స్లో నేరేషన్
    డైలాగ్స్
    స్క్రిప్ట్
    బ్యాడ్ ట్రీట్మెంట్

    చివరగా :

    సినిమాలో మ్యాటర్ బాగున్నా.. దాన్ని తెర పైకి తీసుకువచ్చినా విధానంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. అయితే ఈ సినిమా ఓ సరికొత్త అటెంప్ట్ అని చెప్పొచ్చు. డిఫరెంట్ సినిమాలు చూసే వారిని ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్