https://oktelugu.com/

బాలయ్యకు కథ చెప్పిన ‘క్రాక్’ డైరెక్టర్ !

‘క్రాక్’… ప్లాప్ ల వలయంలో నలిగిపోతున్న ‘మాస్ మహారాజా’ రవితేజకు హిట్ రుచిని చూపిన సినిమా. గత ఏడు సినిమాలుగా సక్సెస్ కోసం యుద్ధం చేస్తున్నా.. సరైన హిట్ ఒక్కటి కూడా లేకపోవడం, రవితేజ కెరీర్ కే పెద్ద దెబ్బలా మారిన పరిస్థితుల్లో మాస్ రాజాకి క్రాక్ సినిమాతో నిజమైన మాస్ హిట్ ను ఇచ్చాడు ‘గోపీచంద్ మ‌లినేని’. ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తూ మొత్తానికి ‘క్రాక్’ కేక అనిపించుకుంది. ఇప్పటికీ ఈ చిత్రం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 6, 2021 / 11:57 AM IST
    Follow us on


    ‘క్రాక్’… ప్లాప్ ల వలయంలో నలిగిపోతున్న ‘మాస్ మహారాజా’ రవితేజకు హిట్ రుచిని చూపిన సినిమా. గత ఏడు సినిమాలుగా సక్సెస్ కోసం యుద్ధం చేస్తున్నా.. సరైన హిట్ ఒక్కటి కూడా లేకపోవడం, రవితేజ కెరీర్ కే పెద్ద దెబ్బలా మారిన పరిస్థితుల్లో మాస్ రాజాకి క్రాక్ సినిమాతో నిజమైన మాస్ హిట్ ను ఇచ్చాడు ‘గోపీచంద్ మ‌లినేని’. ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తూ మొత్తానికి ‘క్రాక్’ కేక అనిపించుకుంది. ఇప్పటికీ ఈ చిత్రం ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో ఇంకా క‌లెక్ష‌న్ల ప్రభంజనం సృష్లిస్తూనే ఉంది. రవితేజ కెరీర్ లోనే ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ నిలిచింది అంటే ఆ క్రెడిట్ గోపీచంద్ కే దక్కుతుంది.

    Also Read: ట్రైల‌ర్‌ టాక్ : ‘నాంది’తోనే జీవితం మొదలైంది !

    అందుకే గోపీచంద్ కి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. వాటిల్లో ముఖ్యమైనది బాలయ్యతో సినిమా. రవితేజకే మాస్ హిట్ ను ఇచ్చిన గోపీచంద్ మలినేని పై బాలయ్య గురి కుదిరిందట. ‘క్రాక్’ సినిమాలో దర్శకుడిగా గోపీచంద్ మలినేని కొన్ని మాస్ సీన్లు తీసిన విధానం బాలయ్యకు చాల బాగా నచ్చిందట. సినిమాలోని బస్ స్టాండ్ ఫైట్, హీరోయిన్ శృతి హాసన్ కి పోకిరి తరహా ట్విస్ట్ ఇవ్వడం లాంటి వాటిల్లో గోపీచంద్ పనితనం బాలయ్యను విపరీతంగా ఆకట్టుకుందని.. అందుకే బాలయ్యే స్వయంగా ఫోన్ చేసి మరీ అభినందించారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

    Also Read: రివ్యూ : జీ జాంబీ : కంటెంట్ పరంగా మెప్పిస్తోంది !

    కాగా ఈ క్రమంలోనే బాలయ్య బాబు తనకు సరిపోయే కథ ఉంటే చెప్పమన్నట్లు.. గోపీచంద్ కూడా బాలయ్యకు తాజాగా ఒక లైన్ చెప్పినట్లు తెలుస్తోంది. పల్నాటి ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి కథ ఆధారంగా గోపీచంద్ బాలయ్యకు కథ చెప్పాడట. మరి బాలయ్య అంటేనే మాస్.. అండ్ ఫుల్ యాక్షన్. అలాంటి కథనే గోపీచంద్ చెప్పాడట. అంటే త్వరలోనే బాలయ్యతో గోపీచంద్ సినిమా ఉండబోతుంది. వీరిద్దరి కాంబినేషన్ ని సెట్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ట్రై చేస్తోంది. సాలిడ్ కథ దొరికితే మాస్ హీరోలను బాగా ఎలివేట్ చేస్తాడనే పేరు గోపీచంద్ కి వచ్చింది. మరి బాలకృష్ణను ఎలా చూపిస్తాడో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్