Homeఎంటర్టైన్మెంట్ఎక్స్ క్లూజివ్: థమన్ తో ఆ డైరెక్టర్ కు గొడవలు !

ఎక్స్ క్లూజివ్: థమన్ తో ఆ డైరెక్టర్ కు గొడవలు !

Shiva Nirvana and Thamanదర్శకుడు శివ నిర్వాణ చాలా కూల్. తన పని ఏదో తాను చేసుకుంటూ పోయే రకం. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవరితో ఎలాంటి గొడవలు లేవు. పైగా ఇప్పటిదాకా చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్. శివ నిర్వాణ డైరెక్టర్ గా ఫుల్ సక్సెస్. అందుకే, ఇండస్ట్రీలో శివ నిర్వాణకు మంచి పేరు ఉంది. ఇలాంటి నేపథ్యం ఉన్న ఒక డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో గొడవ పడ్డాడు అనగానే మొదట ఎవరూ నమ్మలేదు.

శివ నిర్వాణ చేస్తున్న మూడో సినిమా ‘టక్ జగదీష్’. నిజానికి ఈ సినిమాకి థమన్ మాత్రమే తనకు మ్యూజిక్ డైరెక్టర్ గా కావాలి అని పట్టుబట్టి మరీ తీసుకున్నాడు. కారణం.. శివ నిర్వాణ రెండో సినిమా ‘మజిలీ’ నేపథ్య సంగీతం విషయంలో థమన్ చాలా సహాయం చేశాడు. చివర్లో వచ్చి మజిలీకి అద్భుతమైన ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించి.. ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మొత్తానికి థమన్ పనితనానికి ఫిదా అయిపోయిన శివ నిర్వాణ, ‘టక్ జగదీష్’కు సంగీత దర్శకుడిగా థమన్ మాత్రమే చేయాలని ఆయనను ఒప్పించి తన సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. అందుకే, ‘టక్ జగదీష్’ సినిమాకి ముందు, శివ నిర్వాణ – థమన్ మధ్య మంచి అనుబంధం ఉంది. ప్రెస్ మీట్స్ లోనూ ఇద్దరు ఒకరికి ఒకరు ఎంతో గౌరవం ఇచ్చి పుచ్చుకున్నారు.

కానీ, ‘టక్ జగదీష్’ నేపథ్య సంగీతం విషయంలో శివ నిర్వాణ – థమన్ మధ్య మొదలైన అభిప్రాయబేధాలు చివరకు కోల్డ్ వార్ వరకు వెళ్ళిందట. మొత్తానికి వీరిద్దరి మధ్య ఏమి జరిగిందో తెలియదు గానీ, ప్రస్తుతం శివ నిర్వాణ ఫోన్ కాల్స్ ను థమన్ అవాయిడ్ చేస్తున్నాడని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇద్దరి మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే మాటలు లేని పొజిషన్ కి వెళ్ళిందట ప్రస్తుత పరిస్థితి. అయితే, తన సినిమా కోసం మళ్ళీ వీరిద్దరిని కలపడానికి నాని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మరి నాని కోసమైనా వీళ్ళు తిరిగి మళ్ళీ కలిసిపోతారా..? చూడాలి. ఇక ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper