Homeఎంటర్టైన్మెంట్OMG 2 Review: అక్షయ్ కుమార్ మెసేజ్ జనాలకు అర్థమైందా?

OMG 2 Review: అక్షయ్ కుమార్ మెసేజ్ జనాలకు అర్థమైందా?

OMG 2 Review: అక్షయ్ కుమార్ , పంకజ్ త్రిపాఠి కొత్త కాంట్రవర్సల్ కాన్సెప్ట్ తెరకెక్కిన ఓఎం‌‌జీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సన్నీ డియోల్ అమీషా పటేల్ కాంబినేషన్లో వచ్చిన గదర్ 2 తో తలపడుతోంది. రెండు బ్యాక్ టు బ్యాక్ హెడ్ చిత్రాలు.. ఒకప్పుడు సెన్సేషన్ సృష్టించిన మొదటి భాగానికి సీక్వెల్ గా వస్తున్న ఈ రెండు చిత్రాలపై బాలీవుడ్ ఎంతో ఆసక్తి కనబరుస్తోంది. ఈ రెండు సినిమాలకి కామన్ పాయింట్ ఇందులో తండ్రులు తమ కొడుకుల కోసం సమాజంపై చేసే యుద్ధమే.

2012 లో రిలీజ్ అయిన ఓ మై గాడ్ మూవీ సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ దగ్గర అనుమతి పొందడానికి ఓమ్ని యుద్ధమే జరగాల్సి వచ్చింది. ఎంతో సెన్సిటివ్ కాన్సెప్ట్ తో వివాదాస్పద కథాంశంతో తెరకెక్కడంతో ఈ చిత్రానికి క్లియరెన్స్ ఇవ్వడానికి ముందుగా రివిజన్ కమిటీకి పంపించాల్సి వచ్చింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను తొలగించుకొని పూర్తి పర్మిషన్ తో ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్లలో భారీగా విడుదల అయింది.

ఇక కథ విషయానికి వస్తే ఇందులో అక్షయ్ కుమార్ పాత్ర కంటే పంకజ్ త్రిపాఠి క్యారెక్టర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే స్టోరీ మొత్తం తిరిగేది పంకజ్ త్రిపాఠి చుట్టూనే. ఇందులో అతను చేస్తున్న పాత్ర పేరు కాంతి శరణ్ ముద్గల్. ఒక బాధ్యతాయుతమైన తండ్రి , కుటుంబం కోసం పాటుపడే వ్యక్తిగా కాంతి కనిపిస్తారు. అతను చాలా గొప్ప శివ భక్తుడు కూడా. ఒకరోజు కాంతి కొడుకు వివే క్ స్కూల్ బాత్రూంలో అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డాడన్న ఆరోపణతో అతని స్కూల్ నుంచి రస్టికేట్ చేస్తారు. అతను చేస్తున్న పనిని వీడియో కూడా తీసి రిలీజ్ చేయడంతో అది అందరూ చూస్తారు. దీంతో కాంతి కుటుంబంతో ఉన్న ఊరు వదిలి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు.

సరిగ్గా అదే సమయానికి అతని జీవితంలో జరుగుతున్న వాటిని సరియైన దిశలో పెట్టడానికి ఈశ్వరుడు నిశ్చయించుకుంటాడు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.. కాంతి అక్షయ్ కుమార్ ను కలవడం.. కేవలం అవగాహన లోపం, తప్పుడు సమాచారం కారణంగా తన కొడుకు విషయంలో ఇలా జరిగింది అని గ్రహించి రస్టికేషన్ వెనక్కి తీసుకోవాల్సిందిగా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాడు కాంతి. ఇక అక్కడ నుంచి కథ మొత్తం ఫస్ట్ పార్ట్ లాగానే సాగుతుంది. అయితే ఇందులో ప్రస్తుత స్కూలింగ్ వ్యవస్థ ,యువత ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యల గురించి ఎంతో స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది.

లాయర్లు ఎవరు ముందుకు రాకపోవడం …తన కేస్ తనే వాదించుకోవడం.. దేవుడు పక్కన ఉండి గైడ్ చేయడం…అంత కాన్సెప్ట్ బేస్ ఒకటే అయినప్పటికీ ఇందులో కథనం మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంది. మొదటి పార్ట్ లో కంజి లాల్జీ మెహతాగా నటించిన పరేష్ రావల్ పూర్తిగా దేవుడి మీద నమ్మకం లేని ఒక వ్యక్తిగా చూపిస్తే.. రెండవ పార్ట్ లో కాంతి సనాతనమైన శివ భక్తుడిగా చూపిస్తారు. మొత్తం మీద ఓ సెన్సిటివ్ టాపిక్ ని టచ్ చేస్తూ దూసుకు వస్తున్న ఈ చిత్రం సక్సెస్ అందుకుంటున్న లేదా అనేది చూడాలి.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
Exit mobile version