https://oktelugu.com/

Minister KTR Flying Kiss: కేటీఆర్‌ ఫ్లయింగ్‌ కిస్‌.. ఎవరికి పెట్టాడో తెలుసా.. నెట్టింట వైరల్‌..

మంత్రి కేటీఆర్‌ నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటుంటారు. ప్రజల సమస్యలపై, పలు వినతులపై ఆయన సామాజిక మాధ్యమాల్లో స్పందించిన సందర్భాలున్నాయి.

Written By: , Updated On : August 11, 2023 / 11:42 AM IST
Minister KTR Flying Kiss

Minister KTR Flying Kiss

Follow us on

Minister KTR Flying Kiss: ఫ్లయింగ్‌ కిస్‌.. మూడు రోజులుగా ఈ అంశం అటు టీవీలు, పత్రికలతోపాటు, ఇటు సోషల్‌ మీడియాలోనూ హల్‌చల్‌ చేస్తోంది. ఎన్‌డీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా నిర్వహించిన చర్చలో మాట్లాడిన రాహుల్‌ మహిళా మంత్రి స్మృతి ఇరానికి ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చాడని బీజేపీ మహిళా ఎంపీలు ఆరోపించారు. ఈమేరకు లోక్‌సభ స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఇలా హాట్‌ టాపిక్‌ అయిన ఫ్లయింగ్‌ కిస్‌ను తాజాగా తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ కూడా ఇచ్చారు. సొంత నియోజకవర్గం సిరిసిల్ల పర్యటనలో ఈ ఇంట్రెస్టింగ్‌ సీన్‌ చోటు చేసుకుంది. కేటీఆర్‌ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఎవరికి ఇచ్చారో తెలుసా..
మంత్రి కేటీఆర్‌ నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటుంటారు. ప్రజల సమస్యలపై, పలు వినతులపై ఆయన సామాజిక మాధ్యమాల్లో స్పందించిన సందర్భాలున్నాయి. ఇక ఆయన వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌ సొంత ఇలాఖా సిరిసిల్లలో పర్యటిస్తున్న క్రమంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు ఆయన వెళ్లారు. కేటీఆర్‌ క్లాస్‌ రూంల పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తుండగా కిటికీల్లోంచి ఆయన్ని చూసిన విద్యార్థులు కేటీఆర్‌ .. కేటీఆర్‌ అంటూ అరిచారు. దీనితో వస్తున్నా.. వస్తున్నా అంటూ కేటీఆర్‌ విద్యార్థులు ఉన్న కిటికీ వద్దకు వెళ్లారు. ఇది ఏ క్లాస్‌. మీరు ఎందుకు చదువుతలేరు? అని విద్యార్థులను కేటీఆర్‌ అడిగారు. మీకు టీచర్లు లేరా? అని ఆయన అడగగా మేము మీకు ఫ్యాన్స్‌ అని విద్యార్థులు చెప్పారు. దీనికి కేటీఆర్‌ రియాక్ట్‌ అయ్యారు. ‘నేను కూడా మీకు ఫ్యాన్‌’ అని విద్యార్థులతో అన్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారు. దీనితో విద్యార్థులు గట్టిగా అరిచి సంబరపడ్డారు.