Painter Soumitra Mondal: కళ్లనే మోసం చేసే 3డి పెయింటింగ్‌తో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆర్టిస్ట్ కొత్త రికార్డు సృష్టించాడు. 3డి ఇల్యూజన్ పెయింటింగ్స్‌ని రూపొందించి వరల్డ్ గ్రేటెస్ట్ రికార్డ్ బుక్ గుర్తింపును సాధించాడు. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాకు చెందిన పెయింటర్ సౌమిత్ర మొండల్ రూపొందించిన ఈ డిజైన్స్ రియలిస్టిక్‌గా ఉంటాయి. ఆరు వాస్తవిక 3డి ఇల్యూషన్ పెయింటింగ్‌లను రూపొందించడం ద్వారా వరల్డ్ గ్రేటెస్ట్ రికార్డ్ బుక్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు సౌమిత్ర.
23 ఏళ్లుగా పెయింటింగ్..
సౌమిత్ర మొండల్ 23 ఏళ్లుగా పెయింటింగ్‌గా రాణిస్తున్నాడు. తన కుంచెతో కొత్త కళలను సృష్టిస్తున్నాడు. ఇంతకు ముందు కూడా సౌమిత్ర కొత్త, విభిన్న రకాల బొమ్మలు గీసి ప్రత్యేక గుర్తింపు పొందాడు. రొటీన్ పెయింటింగ్‌కు భిన్నంగా ఏదైనా పెయింట్ చేయాలనుకున్నాడు. ఈమేరకు కొత్తగా ఆలోచన చేశాడు. ఆ ఆలోచన నుంచే.. ఈ రికార్డ్ క్రియేట్ అయింది. ఆరు రియలిస్టిక్ 3డి ఇల్యూజన్ పెయింటింగ్స్ ను క్రియేట్ చేసి అద్భుతం అనిపించాడు.
3డి బొమ్మలతో వరల్డ్ రికార్డు..
ఈ త్రీడీ బొమ్మలతో.. వరల్డ్ గ్రేటెస్ట్ రికార్డ్ క్రియేట్ చేయాలన్న ఆలోచనతో.. గత మేలో ఆన్‌లైన్‌లో సౌమిత్రి నమోదు చేసుకున్నాడు. ఒక నెల తరువాత ఈ ఆప్లికేషన్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఆరు 3డి చిత్రాలు గీసి ఔరా అనిపించాడు. అతడి ప్రతిభను గుర్తించిన ఆ సంస్థ.. కొద్దిరోజులకే రికార్డ్‌కు సంబంధించిన సర్టిఫికెట్లు, పతకాలు సౌమిత్ర ఇంటికి చేరిపోయాయి.
చిత్రాలతో కొత్త అనుభూతి..
ఈ 23 ఏళ్లలో అలాంటి రియలిస్టిక్‌గా ఆరు త్రీడీ చిత్రాలను గీశాననీ.. ఈ చిత్రాల ముందు నిలబడితే మదిలో విభిన్నమైన అనుభూతిని కలుగుతుందని సౌమిత్ర మొండల్ చెప్పారు. ఇందుకు వరల్డ్ గ్రేటెస్ట్ రికార్డు అవార్డును అందుకోవడం చాలా గొప్పగా అనిపిస్తోందని తెలిపాడు. భ్రమించే ఫీల్ ను మరింత పెంచేలా.. తాను భవిష్యత్తులో మరింత మెరుగ్గా కృషిచేయాలనుకుంటున్నానని చెప్పాడు సౌమిత్ర.
అంతర్జాతీయ పెయింటింగ్ పోటీల్లో ఆవార్డు..
గత ఏడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌లో జరిగిన అంతర్జాతీయ పెయింటింగ్ ఎగ్జిబిషన్‌లో బెస్ట్ ఆర్టిస్ట్‌గా సౌమిత్ర మొండల్ కూడా అవార్డు అందుకున్నాడు. ఈ అంతర్జాతీయ పెయింటింగ్ ఎగ్జిబిషన్‌లో మరో ఏడు దేశాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారని బెంగాల్ పెయింటర్ తెలిపాడు. సౌమిత్ర తన ప్రతిభతో కొత్త కళను సృష్టిస్తూ పుట్టిన గడ్డ నదియా జిల్లా ముఖచిత్రాన్ని ప్రపంచ మీడియా హెడ్ లైన్స్‌లో పెట్టడం స్థానికంగా అందరిలోనూ సంతోషం నింపుతోంది.