Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా 5 రోజులకి 500 కోట్ల కలెక్షన్స్ ను సంపాదించుకుంది. ఇక టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల సునామీ అయితే సృష్టించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే ఈ సినిమా ఇప్పటివరకు 500 కోట్లను కలెక్ట్ చేసింది అంటూ మేకర్స్ పబ్లిసిటీ అయితే చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా అంతా కలెక్షన్స్ సాధించిందా లేదా అనే విషయం పక్కన పెడితే ఈ సినిమాకి మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది. కాబట్టి ఆ టాక్ ఇప్పుడు పాజిటివ్ టాక్ గా మారిందా? ఇంకా డివైడ్ టాక్ గానే ఉండి ముందుకు సాగుతుందా? అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే చాలా సినిమాలు మొదట డివైడ్ టాక్ తెచ్చుకొని ఆ తర్వాత పాజిటివ్ టాక్ తో సూపర్ సక్సెస్ లను సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి… ఇక దానివల్లే ఈ సినిమాకి కూడా అలాంటి టాక్ వస్తుందా? లేదంటే ఈ సినిమా బిలో అవరేజ్ గానే మిగిలిపోతుందా? అనే విషయాల్లో ఇప్పుడు సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిజానికి దేవర సినిమా ఎన్టీఆర్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా అయితే కాదు. అని కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
యాక్షన్ ఎలివేషన్స్ అలాగే ఎన్టీఆర్ యాక్టింగ్ బాగున్నప్పటికీ కథలోనే చాలా వరకు లోపాలు ఉన్నాయంటూ సినీ విమర్శకులు చాలా వరకు ఈ సినిమాని విమర్శిస్తున్నారు. ఈ సినిమా జన్యూన్ టాక్ ను కనక మనం తెలుసుకున్నట్లయితే ఇది బిలో ఆవరేజ్ గా ఆడుతుంది అనేది మాత్రం వాస్తవం. మరి ఈ వీకెండ్స్ లో ఈ సినిమాని చాలామంది చూశారు.
ఇక మరొక వన్ వీక్ అయితే దేవర హవా మొత్తం తగ్గిపోయే అవకాశాలైతే ఉన్నాయి. కలెక్షన్స్ కూడా భారీగా పడిపోయే అవకాశాలైతే లేకపోలేదు. మరి ఇప్పటివరకు ఈ సినిమా బ్రేక్ ఇవెన్ గా నిలిచిందా అంటే ప్రొడ్యూసర్లు చెబుతున్నా కలెక్షన్స్ ప్రకారం అయితే సినిమా బ్రేక్ ఈవెన్ గా నిలిచింది.
కానీ ఆ కలెక్షన్స్ లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ దేవర సినిమా విషయంలో ప్రొడ్యూసర్లు ఫేక్ కలెక్షన్లు చెబుతున్నారు అంటూ సోషల్ మీడియా లో కొన్ని వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో ఎన్టీయార్ వరుసగా 7 వ సక్సెస్ సాదించాడా లేదా అలాగే ఈ మూవీకి ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరొక వారం రోజులపాటు వెయిట్ చేసి చూడాల్సిందే అని ఇండస్ట్రీ వర్గాల్లోని కొంత మంది పెద్దలు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…