Akkineni Akhil: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దాదాపుగా పదేళ్లు కావొస్తుంది, కానీ ఇప్పటి వరకు సంపూర్ణమైన సూపర్ హిట్ ని చూడలేకపోయిన హీరో అక్కినేని అఖిల్(Akkineni Akhil). బోలెడంత ఫ్యాన్ బేస్ ఉన్న కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరో ఈయన. ఇతని మొదటి సినిమాకు స్టార్ హీరో చిత్రానికి వచ్చినంత క్రేజ్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. కచ్చితంగా టాలీవుడ్ కి మరో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ దొరికేశాడని అంతా అనుకున్నారు. కానీ మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది, రెండవ సినిమా యావరేజ్ గా ఆడింది, ఆ తర్వాత విడుదలైన ప్రతీ సినిమా కమర్షియల్ గా ఫెయిల్యూర్ అవుతూ వచ్చాయి. కేవలం ‘మొస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం ఒక్కటే ఈమధ్య కాలం లో కమర్షియల్ హిట్ గా అనిపించింది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘ఏజెంట్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఇప్పుడు ఆయన తన కెరీర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, సూపర్ హిట్ కొట్టేంత వరకు అభిమానులకు బయట నా ముఖం కూడా చూపించను అని చెప్పి ‘లెనిన్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని అఖిల్ పుట్టినరోజు నాడు విడుదల చేశారు. దానికి ఆడియన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ అంతంత మాత్రమే. ఈ వయస్సు లో అఖిల్ నుండి అభిమానులు ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల రేంజ్ ని ఆశిస్తున్నారు. కానీ అఖిల్ తనకు ఏ మాత్రం సూట్ అవ్వని మాస్ సబ్జక్ట్స్ ని ఎంచుకుంటూ చేసే తప్పునే మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నాడు. ఇలా అయితే ఎప్పటికీ సక్సెస్ ని అందుకోలేడు అంటూ అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అక్కినేని అఖిల్ మరో ప్రాజెక్ట్ కి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఒక వ్యక్తి, రీసెంట్ గానే అఖిల్ ని కలిసి ఒక కథని వినిపించాడట. అది ఆయనకు తెగ నచ్చేసింది, పైగా ప్రశాంత్ నీల్ వద్ద పని చేసిన అనుభవం ఉండి కాబట్టి, కచ్చితంగా మంచి ప్రోడక్ట్ ని అందిస్తాడని నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ని అఖిల్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఏ జానర్ లో తెరకెక్కే సినిమా అనేది ఇప్పటి వరకు ఖరారు కాలేదు. అభిమానులు అఖిల్ నుండి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని ఆశిస్తున్నారు. కానీ ప్రశాంత్ నీల్ స్కూల్ నుండి వస్తున్నా డైరెక్టర్ కావడం తో, కచ్చితంగా ఆయన యాక్షన్ చిత్రమే చేస్తాడని, ఇది అఖిల్ కి వర్కౌట్ అవ్వదేమో అని భయపడుతున్నారు కొంతమంది అక్కినేని అభిమానులు.