Akira Nandan : మెగా ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు ఉందనే విషయం మనందరికీ తెలిసిందే… మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) స్టార్ స్టేటస్ ని అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక తన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన పవన్ కళ్యాణ్ (Pavan kalyan) సైతం చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ గా మారడమే కాకుండా తమ సినిమాలతో ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకున్నాడు. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలను చేస్తూనే ఫుల్ టైం పొలిటిషియన్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మహా అయితే మరో మూడు నాలుగు సినిమాలు మాత్రమే చేసి సినిమాలను ఆపేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే తన అభిమానుల కోరిక మేరకు తన కొడుకుని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ఇక అకిరానందన్ లుక్స్ కూడా చాలా అద్భుతంగా ఉండడంతో స్టార్ హీరో అయ్యే రేంజ్ అతనికి ఉందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : మొదటి సినిమాకే పాన్ ఇండియన్ డైరెక్టర్..2 ఏళ్లలో అకిరా నందన్ గ్రాండ్ టాలీవుడ్ ఎంట్రీ!
మరి ఇదిలా ఉంటే ఇప్పటికే అకిరానందన్ (Akiraa Nandan) కి యాక్టింగ్ లో శిక్షణను ఇప్పిస్తున్న పవన్ కళ్యాణ్ తొందర్లోనే ఆయన్ని సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే తనని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను యంగ్ డైరెక్టర్ అయిన సుజీత్(Sujith) కి అప్పగించే ప్రయత్నం కూడా చేస్తున్నారట.
ఇప్పటికే సుజీత్ తో పవన్ కళ్యాణ్ ‘ఓజి'(OG ) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసే సినిమాగా ఈ సినిమా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది.
ఓజి సినిమాతో మరోసారి తన పంజా దెబ్బను బాక్సాఫీస్ కి రుచి చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే ఆయన స్టార్ డైరెక్టర్ గా మారడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ స్టైల్ ని కూడా క్రియేట్ చేసుకున్న వాడవుతాడు… ఒకవేళ సుజీత్ అకిరా నందన్ ను కూడా పరిచయం చేస్తే ఎలాంటి సినిమాతో అతని ఇంట్రడ్యూస్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…
Also Read : రీ ఎంట్రీ కి సిద్దమైన సీనియర్ హీరోయిన్ రంభ..ఆ స్టార్ హీరో సినిమాలో ఛాలెంజింగ్ రోల్!