Akira Nandan : గత రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కొడుకు, అకిరా నందన్(Akira Nandan) సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ తో కలిసి దక్షిణ భారతదేశం లో ఉన్నటువంటి పవిత్ర ఆలయాలను సందర్శించుకునేందుకు అకిరా కూడా తన తండ్రితో కలిసి వచ్చాడు. గుబురు గెడ్డం తో పవన్ కళ్యాణ్ టీనేజ్ లో ఎలా అయితే ఉండేవాడో, అలాంటి లుక్స్ తో కనిపించడంతో అభిమానులు పూనకలొచ్చి ఊగిపోయారు. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కు సంబంధించి చిన్న చిన్న అంశాలను కూడా ఎంతో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునే అభిమానులు, ఇక అకిరా నందన్ ఈ రేంజ్ లుక్ తో కనిపిస్తే ఎందుకు సైలెంట్ గా ఉంటారు?, సోషల్ మీడియా ని షేక్ చేసేయరు!, ఇప్పుడే అదే చేసారు. ఆయన లేటెస్ట్ ఫొటోలతో చేసిన ఒక ఎడిట్ వీడియో ఇప్పుడు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది.
టీవీ చానెల్స్ లో కూడా ఆ వీడియో ని ప్రదర్శిస్తున్నారు. అదంతా పక్కన పెడితే అకిరా నందన్ కొద్దినెలల నుండి సత్యదేవ్ యాక్షన్ స్కూల్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఆయన తండ్రి పవన్ కళ్యాణ్ కి నటనలో ట్రైనింగ్ ఇచ్చింది కూడా సత్యదేవ్(Sathya Dev) గారే. ప్రభాస్(Prabhas), మహేష్ బాబు(Mahesh Babu) వంటి వారు కూడా ఆయన ట్రైనింగ్ నుండి ఇండస్ట్రీ లోకి వచ్చిన స్టూడెంట్స్. వీళ్లంతా ఎంత సహజంగా నటిస్తారో మనమంతా దశాబ్దాల నుండి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అకిరా నందన్ కూడా అదే స్కూల్ నుండి రాబోతున్నాడు కాబట్టి, కచ్చితంగా మంచి రేంజ్ కి వెళ్లబోతున్నాడు అని ఆశించవచ్చు. ఇదంతా పక్కన పెడితే నిర్మాతలు ఇప్పటి నుండే అకిరా నందన్ మొదటి సినిమా తమ బ్యానర్ లో చేయాలనీ పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తెస్తున్నారట.
ఒక స్టార్ నిర్మాత అయితే పాన్ ఇండియన్ డైరెక్టర్ ని సిద్ధం చేసి, సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నాడట. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పటి నుండే స్టోరీ ని సిద్ధం చేసే పనిలో పడ్డారట. అకిరా నందన్ కి ఆ రేంజ్ డిమాండ్ ఉంది. అయితే అకిరా నందన్ సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టడానికి మరో రెండేళ్ల సమయం పడుతుంది. ఆయన ఎంట్రీ కి ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొదటి సినిమాతో , మొదటి రోజే వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టేంత స్టామినా అకిరా కి ఉంటుంది. మహేష్ బాబు, రామ్ చరణ్ డెబ్యూ మూవీస్ తర్వాత అంతటి గ్రాండ్ గా లాంచ్ అయ్యేది అకిరా నందన్ అనడం లో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో, ఇక నుండి ఆయన లేజసీ ని అకిరా ఎలా మైంటైన్ చేస్తాడో చూడాలి.