Ram Charan And Sukumar
Sukumar : పుష్ప 2 (Pushpa 2) సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న దర్శకుడు సుకుమార్(Sukumar)…ఆయన చేసిన ప్రతి సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పిస్తు ముందుకు సాగుతున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికే వరుసగా మూడు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్న సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్(Ram Charan)తో చేయబోయే సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను స్టార్ట్ చేసిన సుకుమార్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి వరుసగా నాలుగో విజయాన్ని కూడా ఆడ్ చేసుకోవాలని చూస్తున్నాడు… ఇక ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్ లో రంగస్థలం (Rangasthalam) అనే సినిమా వచ్చింది. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న వీళ్లిద్దరూ మరోసారి అంతకు మించిన విజయాన్ని దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు రాబోతున్న సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఇక రామ్ చరణ్ తో ఫ్యామిలీ సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉంటాయి. దానికి ఏమాత్రం తగ్గకుండా యాక్షన్ ఎపిసోడ్స్ ని యాడ్ చేస్తూ, ట్విస్టులను కూడా భారీగా రంగరించి మరి ఈ సినిమా స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో నటిస్తున్నాడు.
Also Read : రామ్ చరణ్, సుకుమార్ సినిమాకు ‘మిషన్ ఇంపాజిబుల్’ స్ఫూర్తి..ఇలాంటి సినిమాలు మన టాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చుతాయా?
ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సిద్ధమవుతాడు. మరి ఈ సినిమాతో ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుంది. రామ్ చరణ్ కి ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుంది.
సుకుమార్ గత చిత్రాలకు మించి ఈ సినిమా ఉండబోతుందా? అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి… మొత్తానికైతే ఈ సినిమాతో ఇటు రామ్ చరణ్, అటు సుకుమార్ మరోసారి పాన్ ఇండియాని శాసించే స్థాయికి ఎదుగుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ‘పుష్ప 2’ సినిమా సూపర్ సక్సెస్ అయినప్పటికి సుకుమార్ కి అంత సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వడం లేదట.
ఎందుకంటే అది సుకుమార్ మార్కు సినిమా కాదని, డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసిన సినిమా కావడం వల్ల ఆ సినిమా విషయంలో ఆయన అంత సంతృప్తి చెందుతున్నట్టుగా కనిపించడం లేదంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అందుకే రామ్ చరణ్ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకొని పూర్తి సాటిస్ఫాక్షన్ ని పొందాలని కోరుకుంటున్నాడట…