AP Budget 2025: ఏపీలో ఎన్నికలకు ముందు కూటమి నాయకులు సూపర్ సిక్స్ పథకాలపై విపరీతంగా ప్రచారం చేశారు. ఏపీ భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తామని వ్యాఖ్యానించారు. కూటమినేతల మాటలు నమ్మిన ప్రజలు తమ ఓట్లు వేసి గెలిపించారు. అప్పటిదాకా అధికారంలో ఉన్న వైసీపీని ప్రతిపక్షంలోకి కూడా పంపించకుండా ఏకపక్ష తీర్పు ఇచ్చారు. 11 స్థానాలకే వైసీపీని పరిమితం చేశారు.
Also Read: జనసేన ప్లీనరీ కుదింపు.. సంచలన నిర్ణయం.. కారణాలు అవే!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల అమలు వెంటనే జరిగిపోతుందని ప్రజలు భావించారు. కానీ ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. మరోవైపు కేంద్రంలో టిడిపి, జనసేన ఎంపీలు కీలకంగా ఉన్న నేపథ్యంలో ఏపీకి గత బడ్జెట్లో వరాలు కురిసాయి. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించింది.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా ఆగిపోయింది. ఇవి రెండు కూటమి ప్రభుత్వానికి కాస్త ఉపశమనం కలిగించాయి. ఇక ఇటీవలి బడ్జెట్లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించింది. నిధుల కేటాయింపును కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. ప్రజల సంక్షేమమే తనకు పరమావధి అని వ్యాఖ్యానించింది. కానీ కేటాయింపులు లెక్కల విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం సమర్ధించుకోలేకపోతోంది. ఇక ఇదే క్రమంలో వైసీపీ నేతలు సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వాన్ని లెక్కలతో విమర్శిస్తున్నారు. అందులో ఒక వీడియో ఆలోచింపజేస్తున్నది.
లెక్కలతో కొట్టారు
ట్విట్టర్లో power _Ranger _ Trolls అనే ఐడీలో ఒక వీడియో తెగ సందడి చేస్తోంది.. దానికి ” కూటమిని నమ్ముకున్న వాళ్ళ ముఖచిత్రం ఏమిటో” అనే ట్యాగ్ లైన్ ను జత చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఏపీ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ను లెక్కలతో సహా విమర్శిస్తున్నాడు. ” ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడికి వెళ్లే విద్యార్థులు 87, 42,000 మంది. ఇందులో 2,42,000 మందిని అనర్హులుగా ప్రకటిస్తే.. 85 లక్షల మందికి అమ్మఒడి ఇవ్వాల్సి ఉంటుంది. వీరందరికీ అమ్మ ఒడికిగానూ ₹15000 చొప్పున ప్రతి ఏడాది ₹12, 750 కోట్ల పైచిలుకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి కోసం ప్రభుత్వం ₹9, 400 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరందరికీ ఏటా 20వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తే.. ₹10,800 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ₹6,300 కోట్లు.. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి 53 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 23 లక్షల కనెక్షన్లను పక్కనపెట్టినా కోటి 30 లక్షల కనెక్షన్లకు.. వీటికి ప్రభుత్వం ఇచ్చే నగదు ఏటా ₹3,500 కోట్లు. కానీ అలాట్ చేసిన బడ్జెట్ ₹2,600 కోట్లు. ఇలా కోతలు పెట్టుకుంటూ పోతే.. సూపర్ సిక్స్ పథకాల అమలులో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలా జరగలేదు కదా? జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో రెండున్నర సంవత్సరాలు కరోనాకే పోయింది కదా. అయినప్పటికీ పథకాల అమలు నిలిపివేయలేదు కదా. మిగతా రెండున్నర సంవత్సరాల కాలంలోనూ బ్రహ్మాండంగానే పథకాలు అమలు చేశారు కదా. మరి ఇప్పుడు ఏమైంది? కరోనా రాలేదు.. లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి. బడ్జెట్లో కోతలు పెడుతున్నారని” ఆ వీడియోలో వ్యక్తి ప్రశ్నించారు. దీనిని వైసిపి అనుకూల సోషల్ మీడియా గ్రూపులో తెగ ప్రచారం చేస్తున్నాయి. మరి దీనిపై టిడిపి నాయకులు ఏ విధమైన కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.
Also Read: ఏపీలో ఆ మూడు పథకాలపై సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు
కూటమిని నమ్ముకున్నా వాళ్ల ముఖచిత్రం ఏటి అంటారు??#AndhraPradeshBudget2025 #BudgetSession2025 pic.twitter.com/mA72MwXiEL
— Power_Ranger_Trolls (@Neninthae_) March 1, 2025