Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu OTT: అషురెడ్డికి షాకిచ్చిన అఖిల్ మదర్? బిగ్ బాస్ షోలో ఇదే...

Bigg Boss Telugu OTT: అషురెడ్డికి షాకిచ్చిన అఖిల్ మదర్? బిగ్ బాస్ షోలో ఇదే వైరల్

Bigg Boss Telugu OTT: బుల్లితెర చరిత్రలో కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది బిగ్ బాస్. ప్రేక్షకుల ఆదరణతో భారీ స్తాయిలో ఆదరణ పొందుతోంది. దీంతో అన్ని భాషల్లో తనదైన శైలిలో దూసుకుపోతోంది. తెలుగులో ఎక్కువగానే అభిమానులను సంపాదించుకుంటోంది. అందుకే నిర్వాహకులు సీజన్ల కొద్దీ ఎపిసోడ్లు ప్రసారం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మొదటి సీజన్ నడుస్తోంది. ఇందులో కుటుంబసభ్యుల ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. దీంతో షో బ్రహ్మాండంగా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

Bigg Boss Telugu OTT
Bigg Boss Telugu OTT

రేటింగ్ కోసం కంటెస్టెంట్ల మధ్య గొడవలు, లవ్ ట్రాకులు, ముద్దులు, హగ్గులు తదితర వాటిని ప్రోత్సహిస్తూ బిగ్ బాస్ తన పరిధిని విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే రోజురోజుకు కొత్తదనం చూపుతూ దూసుకుపోతోంది. దీంతో సహజంగానే ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల కంటెస్టెంట్ల కుటుంబ సభ్యుల రాకతో ఇంకా సందడి పెరిగింది. మొదటి సీజన్ నుంచి ఐదో సీజన్ వరకు బిగ్ బాస్ మంచి ఊపు తెచ్చుకుంటోంది.

Also Read: Kajal Remuneration For Acharya: ఆచార్య సినిమా కోసం కాజల్ అగర్వాల్ కి అంత రెమ్యూనరేషన్ ఇచ్చారా..!

బిగ్ బాస్ లో కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు రావడంతో గురువారం ప్రసారమైన ఎపిసోడ్ లో యాంకర్ శివ సోదరి, అషురెడ్డి తల్లి, నటరాజ్ మాస్టర్ భార్య, పాప ఎంట్రీ ఇచ్చారు దీంతో ఎపిసోడ్ కు సందడి పెరిగింది. పాప లక్ష్య స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రెండో రోజు అరియానా గ్లోరి తరఫున ఆమె స్నేహితుడు తరువాత అఖిల్ సార్థక్ తరఫున అతడి తల్లి ప్రవేశించారు అఖిల్ మదర్ మాత్రం సరదాగా కనిపించింది. అందరితో కలివిడిగా కలిసిపోయింది.

Bigg Boss Telugu OTT
Bigg Boss Telugu OTT

అందరితో ఆప్యాయంగా మాట్లాడిన అఖిల్ మదర్ అషురెడ్డికి మాత్రం షాక్ ఇచ్చింది. ఇక్కడకు ఆడటానికి మాత్రమే రావాలి. ఎమోషన్స్ పెట్టుకోకూడదు. అందరితో మంచిగా ఉండి మంచి ఆటతీరు కనబరచాలి. అంతే కానీ ఎమోషనల్ గా బాండ్ అవడానికి వస్తే నెగ్గలేవు అంటూ ముఖం మీదే చెప్పేయడంతో అషు లోలోపలే బాధపడింది. అక్కడి నుంచి మెల్లగా జారుకుంది.

Also Read:RRR: ‘ఆర్ఆర్ఆర్’ పాదాల చెంత మరో రికార్డు.. తెలిస్తే షాకే

Recommended Videos:

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

2 COMMENTS

  1. […] Playback Movie: గత ఏడాది వచ్చిన ప్లే బ్యాక్ అనే ఒక సినిమా ప్రస్తుతం నెటిజన్లను చాలా బాగా ఆకట్టుకుంటుంది. మరి, నిజంగానే ఈ సినిమా అంత బాగుందా ? నిజానికి ఈ సినిమా మొదటిసారి భారత దేశంలో ఒక “క్రాస్ టైం కనెక్షన్” అనే అంశంపై తెరకెక్కింది. (అంటే వేరు వేరు కాలంలో ఉండే వాళ్ళు ఫోన్ లలో మట్లాడుకోవడం). ఈ సినిమాలో పెద్ద నటులు ఎవరు లేరు కాబట్టి, జనాలకి ఈ సినిమా మీద ఆశక్తి కలగలేదు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular