Kajal Remuneration For Acharya: మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా 2000 థియేటర్స్ లో విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల మధ్య విడుదల అయినా ఈ సినిమా డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది..ఇది కాసేపు పక్కన పెడితే, ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి కి జోడిగా కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా అనుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఈ సినిమా కథ డెవలప్ చేస్తున్నప్పుడు కాజల్ అగర్వాల్ పాత్ర కి మూవీ లో పెద్దగా ప్రాధాన్యత సంతరించుకోకపోవడం తో ఆమె పాత్రని తొలగించాము అని..ఈ విషయం ఆమెకి అర్థం అయ్యేలా చెప్తే ఆమె కూడా అర్థం చేసుకొని తప్పుకున్నారు అని కొరటాల శివ ఇటీవల జరిగిన ఆచార్య మూవీ ప్రొమోషన్స్ లో తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే.

అయితే ఈ విషయం గురించి లోతుగా పరిశీలిస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..అసలు విషయానికి వస్తే తొలుత ఈ పాత్ర కోసం త్రిష ని అనుకున్నారు..మెగాస్టార్ చిరంజీవి తో సినిమా అనగానే ఓకే చెప్పేసిన త్రిష,కొరటాల శివ కొన్ని రోజులు తర్వాత ఆమెని కలిసి స్క్రిప్ట్ మొత్తం చెప్పాడు..ఇందులో ఆమె పాత్రకి ఏ మాత్రం ప్రాధాన్యత లేకపోవడం తో త్రిష సున్నితం గా ఈ సినిమాలో చెయ్యడానికి నో చెప్పేసింది..ఇక ఆ తర్వాత కొరటాల శివ కాజల్ అగర్వాల్ కి స్క్రిప్ట్ చెప్పడం తో ఆమె ఒప్పుకొని వెంటనే డేట్స్ ఇచ్చేసింది..ఇందుకోసం ఆమెకి ఒక్క కోటి 50 లక్షల రూపాయిల పారితోషికం కూడా అందించింది కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్..కొన్ని రోజులు ఆమె పై షూటింగ్ చేసారు కూడా!.
Also Read: KGF 2: 15 రోజు కూడా ‘రాఖీ భాయ్’ కుమ్మేశాడు.. అంతా దద్దరిల్లిపోయింది !
కానీ కథ కి ఆమె పాత్ర అడ్డంగా ఉండడం తో సినిమా నుండి తొలగించేసారు..కానీ తక్కువ రోజులు షూటింగ్ చేసినప్పటికీ..సినిమాలో ఆమె పాత్ర ని తొలగించినప్పటికీ ఆమె తీసుకున్న డబ్బుల నుండి కొణిదెల ప్రొడక్షన్స్ వెనక్కి ఒక్క రూపాయి కూడా అడగలేదు అంట..మమల్ని నమ్మి డేట్స్ ఇచ్చింది..మనమే సరిగా ఉపయోగించుకోలేదు..అందుకే పారితోషికం గురించి కూడా ఒక్క రూపాయి కూడా వెనక్కి అడగలేదు అట టీం..అందుకే కాజల్ తన పాత్రని తొలగించిన కూడా ఎలాంటి గోల చెయ్యలేదు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
Also Read: Allu Arjun: పవన్ డైరెక్టర్ తో బన్నీ ప్లానింగ్.. సెట్ ఐతే షాకే !
Recommended Videos:
[…] […]
[…] OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఇటీవల వివాదానికి దారి తీసిన పాన్ మసాలా యాడ్ వల్ల బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కంపెనీ KGF2 హీరో యశ్‌ను సంప్రదించింది. కానీ అతడు పాన్ మసాలాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండలేనంటూ తిరస్కరించాడు. గతంలో అల్లు అర్జున్ కూడా ఈ యాడ్‌ను రిజెక్ట్ చేసినట్లు కథనాలు వచ్చాయి. దీంతో సౌత్ హీరోలు రియల్‌గానూ హీరోలే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. […]
[…] Anushka Shetty: స్వీటీ అనుష్క ఇండస్ట్రీకి వచ్చి దగ్గర దగ్గరగా రెండు దశాబ్దాలు అవుతుంది. అయినా, ఇప్పటికీ అనుష్కకి ఫుల్ క్రేజ్ ఉంది. పైగా హీరోయిన్ గా కూడా మళ్లీ ఫుల్ ఫామ్ లోకి రావాలని నవీన్ పోలిశెట్టితో సినిమా చేస్తోంది. యంగ్ బ్యూటీస్ రష్మిక, పూజా హెగ్డే, కీర్తి సురేష్, కృతి శెట్టి, కేతిక శర్మ లాంటి కొత్త భామలు వరుస అవకాశాలతో రెచ్చిపోతున్నా.. అనుష్కకి మాత్రం సినిమాలు తగ్గలేదు. […]