https://oktelugu.com/

Most Eligible Bachelor Trailer: అక్కినేని అఖిల్ ‘బ్యాచిలర్’ కష్టాలు

Most Eligible Bachelor Trailer: అక్కినేని నాగార్జున నట వారసుడు అఖిల్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న రోమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించి ‘ట్రైలర్’ను విడుదల చేశారు. ట్రైలర్ ను సినిమాపై ఆసక్తి పెంచేలా బ్యాచిలర్ల పెళ్లి కష్టాలు ప్రతిబింబించేలా ఆసక్తికరంగా కట్ చేశారు. ‘మన […]

Written By: , Updated On : October 1, 2021 / 10:50 AM IST
Follow us on

Most Eligible Bachelor Trailer: అక్కినేని నాగార్జున నట వారసుడు అఖిల్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న రోమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించి ‘ట్రైలర్’ను విడుదల చేశారు. ట్రైలర్ ను సినిమాపై ఆసక్తి పెంచేలా బ్యాచిలర్ల పెళ్లి కష్టాలు ప్రతిబింబించేలా ఆసక్తికరంగా కట్ చేశారు.

‘మన లైఫ్ పార్ట్ నర్ తో 9వేలకు పైగా రాత్రులు పడుకోవాలి.. వందల పర్యటనలకు వెళతాం.. అంతకుమించి కొన్ని లక్షల కబర్లు చెబుతాం.. అలాంటి వాడు ఎవడుంటాడు’ అని పూజా హెగ్డే వాయిస్ తోనే ఇది ట్రిక్కి ప్రేమ కథా చిత్రం అని ప్రారంభించారు.

ఇక జీవితంలో పోరాడి పెళ్లి కోసం తపించే పాత్రలో అఖిల్ కనిపించాడు. అబ్బాయి జీవితంలో 50శాతం కెరీర్, 50శాతం పెళ్లి అని అఖిల్ తపనపడుతూ పరిగెట్టేలా ట్రైలర్ లో చూపించారు. ఇక అఖిల్ పెళ్లి చూపులు సీన్లు అన్ని వివిధ హీరోయిన్లతో చాలా ఫన్నీగా రూపొందించారు.

ఇక ఆ తర్వాత హీరోయిన్ పూజాహెగ్డే అతడికి పెళ్లి చూపుల్లో కనిపించడం.. అతడి జీవితం సీరియస్ మోడ్ లోకి వెళ్లడం.. కథలో మలుపు చూపించారు. ఇక సర్దుకుపోవడం జీవితంలో ముఖ్యం అనే సందేశం ఇస్తూ ఎండ్ చేసినట్టు తెలుస్తోంది. విడుదలైన ఈ ట్రైలర్ ఆసక్తి రేపుతోంది.

-ట్రైలర్ ను కిందచూడొచ్చు.

Most Eligible Bachelor Theatrical Trailer | Akhil Akkineni, Pooja Hegde | Bhaskar | #MEBOnOct15th