PM Modi: భారతదేశంలో సంపద పెరుగుతోంది. కుబేరుల సంఖ్య కూడా అదే స్థాయిలో రెట్టింపవుతోంది. రోజుకు రూ. కోట్లు సంపాదిస్తూ ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. భారత కుబేరుల్లో ముకేష్ అంబానీ రోజుకు రూ.163 కోట్లు సంపాదిస్తూ రూ.7,18,000 కోట్లతో నెంబర్ వన్ గా నిలుస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆయన సంపద 9 శాతం పెరిగింది. తర్వాత స్థానాల్లో శివ్ నాడార్, హిందూజా, లక్ష్మీమిట్టల్, పూనావాలా, దమానీ, శాంతిలాల్, కేఎం బిర్లా, జే చౌదరిలు ఉన్నారు.

దేశంలో పేదవాడు పేదవాడిగానే ఉంటున్న ధనవంతులు మాత్రం పెరిగిపోతున్నారు. సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమవుతోంది. దీంతో ఆర్థిక తారతమ్యాలు చోటుచేసుకుంటున్నాయి. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ రోజుకు రూ.1002 కోట్లు ఆర్జిస్తుండడం విశేషం. గతేడాది సంపదతో పోలిస్తే ఆయన సంపద విలువ 261 శాతం పెరిగి రూ.5,05,900 కోట్లకు చేరింది. ఆసియాలోనే రెండో కుబేరుడిగా అదానీ నిలిచారు.
గురువారం ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా 100 మందితో రూపొందించిన రిచ్ లిస్ట్ -2021 లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.9 లక్షల కోట్లకు పాకింది. అదానీ ప్రధాని మోడీకి స్నేహితుడు కావడం విశేషం. దుబాయ్ లో ఆయన సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ కుటుంబం ఏకంగా 12 స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరారు.
భారత్ పే వ్యవస్థాపకుడు శాశ్వత్ నక్రానీ 23 ఏళ్లకే టాప్ 100 జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఐఐటీ చదువుతుండగానే 2018లో ఈ యాప్ ను నక్రానీ రూపొందించారు. గత ఏడాదితో పోలిస్తే 13 మంది వ్యక్తుల సంపద రూ.లక్ష కోట్లకు పైగా పెరిగింది. పదేళ్ల కిందటితో పోలిస్తే బిలియనీర్ల సంఖ్య నాలుగింతలు పెరిగింది. గత ఏడాది కంటే 58 శాతం మంది అదనంగా పెరిగారు.
40 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు జాబితాలో చోటు దక్కించుకుంటున్నారు. ఫార్మా, రసాయనాలు, పెట్రో రసాయనాలు, సాఫ్ట్ వేర్ రంగాల్లో నిలుస్తున్నారు. హైదరాబాద్ లో కూడా ఐదురుగు కుబేరులు పెరిగారు. దీంతో వారి సంఖ్య 56కు చేరింది. దీంతో దేశంలో కుబేరుల సంఖ్య పెరిగిపోతోంది. సంపద పెంచుకుంటూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. రోజురోజుకు సందప పెంచుకుంటూ తమ స్థానాలు ఇంకా రెట్టింపు చేసుకుంటున్నారు.