Balakrishna Akhanda: నటసింహం బాలయ్య – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ’లో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, శ్రీకాంత్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖండ సినిమాలోని తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘అఖండ’ సినిమాలో నేను విలన్ గా నటిస్తున్నాను. అయితే తెర పై నేను ఎలా కనిపించబోతున్నానో ఎవరూ ఊహించలేరు. నా లుక్, నా పాత్ర వేషధారణ అంత డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. ఎన్నో గెటప్స్ గీయించిన తర్వాత బోయపాటి గారు చివరకు ఒక లుక్ కి ఫిక్స్ అయ్యారు’ అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

ఇక ప్రస్తుతం ఈ రోటీన్ యాక్షన్ కొట్టుడు డ్రామా ‘అఖండ’ చివరి షెడ్యూల్ జరుగుతుంది. లాస్ట్ వీక్ గోవాలో స్టార్ట్ చేశారు. గోవాలోని ఓ రిసార్ట్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ సీన్స్ లో బాలకృష్ణతో పాటు ప్రగ్యా అలాగే ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొన్నారు. ఈ యాక్షన్ సీన్స్ ను ఫేమస్ యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టంట్ శివ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రధాన హైలైట్ అవ్వబోతున్నాయట. పైగా బాలయ్య – బోయపాటి అంటేనే యాక్షన్ కి విందుభోజనం లాంటిది. పై వీరిద్దరి కలయికలో గతంలో సింహా, లెజెండ్ లాంటి బారీ హిట్స్ వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా హ్యాట్రిక్ కోసం వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తున్నారు కాబట్టి.. ఇది కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.
అందుకే, ఈ సినిమా టీజర్ రిలీజ్ అయి హిట్ అయిన దగ్గర నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా బాలయ్య అభిమానులు చాల సంవత్సరాలు తరువాత తల ఎత్తుకుని సగర్వంగా తమ అభిమాన హీరో సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది ఈ సినిమా టీజర్. 80 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి అఖండ టీజర్ భారీ క్రేజ్ ను తెచ్చుకుంది.