spot_img
Homeఎంటర్టైన్మెంట్Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే ‘లెనిన్’ చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ కూడా ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. 40 కోట్ల షేర్ మార్కుకి చాలా దగ్గరగా వచ్చింది. వరుస ఫ్లాప్స్ ని ఎగురుకుంటూ , ఒకే ఒక్క హిట్ కొడితే ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే , భవిష్యత్తులో అఖిల్ రెండు మూడు హిట్లు కొడితే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోతాడు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ విజయాన్ని తమ విజయంగా భావించి సంబరాలు చేసుకుంటున్నారు. అభిమానులు ఇంతలా ప్రేమిస్తున్న అఖిల్ మన భారత దేశానికీ చెందిన వాడు కాదు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా.. ?.

ఈ విషయాన్ని మేము చెప్పడం లేదు , స్వయంగా అఖిల్ రీసెంట్ గా జరిగిన ఒక పోడ్ క్యాస్ట్ లో చెప్పుకొచ్చారు. అఖిల్ పుట్టి పెరిగింది అమెరికా లో అనే సంగతి మన అందరికీ తెలిసిందే. అక్కడ కొంతకాలం పెరిగిన తర్వాత ఇండియా కి తిరిగి వచ్చేశాడు. అమెరికా లో పుట్టడం వల్ల , అఖిల్ కి అక్కడ ఆ దేశ పౌరసత్వం లభించింది. ఇప్పటికీ తాను అమెరికన్ సిటిజెన్ గా కొనసాగుతున్నాని అఖిల్ ఈ పోడ్ క్యాస్ట్ లో వివరించారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే , అఖిల్ కి ఇప్పటి వరకు భారతదేశ పౌరసత్వం లేదట. అంటే టెక్నికల్ గా ఆయన మన ఇండియన్ సిటిజెన్ కాదు. అంత మాత్రానా తాను ఇండియన్ కాకుండా పోనని, తాను నూటికి నూరు శాతం ఇండియన్ ని అని ,టెక్నికల్ గా మన దేశ పౌరుడిగా మారే ప్రక్రియ జరుగుతోందని , త్వరలోనే అమెరికన్ సిటిజెన్ షిప్ ని వదులుకోబోతున్నానని , ఇండియన్ గా మారబోతున్నానని అఖిల్ చెప్పుకొచ్చారు.

అఖిల్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇలాంటి విషయాలను సాధారణంగా బయటపెట్టడానికి సెలబ్రిటీలు ఇష్టం చూపించరు, బయట పెట్టాల్సిన అవసరం కూడా లేదు , ఎందుకంటే అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం. కానీ అభిమానులకు , ప్రేక్షకులకు ప్రతీ విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనే ఉద్దేశ్యంతోనే , అఖిల్ ఇలా మాట్లాడాడు, ఆయన చేసిన ఈ పనికి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...

Pawan Kalyan And Allu Arjun: పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ మాటను ఇప్పటికీ గుర్తుంచుకున్న అల్లు అర్జున్…

Pawan Kalyan And Allu Arjun: 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుని...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త.. ఆ క్రేజీ మూవీ శాశ్వతంగా ఆగిపోయినట్టే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఓజీ 2' అప్డేట్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక స్పెషల్ వీడియో...
Oktelugu Epaper
Exit mobile version