Kajal Aggarwal: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ , అప్పటి నుండి చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే పోషిస్తూ , తన ప్రత్యేకత ని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. లేటెస్ట్ గా ఆమె బాలీవుడ్ లో ‘ది ఇండియా స్టోరీ’ అనే చిత్రం లో నటించింది. నిన్ననే ఈ సినిమా అక్కడ గ్రాండ్ గా విడుదలైంది. ఈ కల్తీ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ప్రతీ రోజు మనం తాగే పాకెట్ పాలు మంచివి కావని , కల్తీ పై అవగాహన కల్పించేందుకే ఈ చిత్రాన్ని తీశారని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.
ఇదే ఇంటర్వ్యూ లో ఆమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘నా కుమారుడికి పాలు ఇచ్చే సమస్యే లేదు. ఈ విషయం లో నన్ను కసాయి తల్లి అని సమాజం తిట్టుకున్నా పర్వాలేదు. నాకు నా కొడుకు ఆరోగ్యం ముఖ్యం. నేను ఇంట్లో వాడి కోసం ప్రత్యేకంగా పన్నీరు తయారు చేసి ఇస్తుంటాను , స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫుడ్ ని మాత్రమే వాడికి అందేలా చూసుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘మన దేశం లో ఆహార కల్తీ ప్రస్తుతం విపరీతంగా ఉంది. అంతే కాలేదు , ఈ కల్తీ కారణంగానే యువతలో క్యాన్సర్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఒక ప్రాజెక్ట్ రీసర్చ్ లో అనేక షాకింగ్ విషయాలు తెలుసుకున్నాను. అప్పటి నుండి నేను పుచ్చకాయ తినడం ఆపేశాను ‘ అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.
ఇకపోతే నిన్న విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుండి మంచి రివ్యూస్ వచ్చాయి. కానీ కలెక్షన్స్ మాత్రం రాలేదు. కనీసం ఈ సినిమాని చూస్తున్నాము అంటూ సోషల్ మీడియా లో ఒక్కరు కూడా పోస్ట్ చేయలేదు. ఒకపక్క కాజల్ తో సరిసమానమైన క్రేజ్ ని సంపాదించుకున్న సమంత ‘మా ఇంటి బంగారం’ లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేసి కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకొని 100 కోట్ల గ్రాస్ ని కొల్లగొడితే , కాజల్ అగర్వాల్ తన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాబట్టలేకపోయిందని సోషల్ మీడియా లో సమంత ఫ్యాన్స్ కాజల్ పై ట్రోల్స్ వేస్తున్నారు.



