Lenin Movie : అఖిల్ ‘లెనిన్’ చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకుంటోంది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని రాబట్టి , లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం , కొత్త సినిమాలు విడుదలైనప్పటికీ కూడా రాణిస్తోంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 13 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 43 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దీంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక 30 కోట్ల షేర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గ్రాస్ వసూళ్లు 51 కోట్ల 25 లక్షల రూపాయిల వరకు ఉంది. ప్రాంతాల వారీగా ఈ 13 రోజుల్లో ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ నుండి 3 కోట్ల 74 లక్షలు , ఉత్తరాంధ్ర నుండి 4 కోట్ల రూపాయిలు , ఈస్ట్ గోదావరి నుండి 2 కోట్ల 55 లక్షలు , వెస్ట్ గోదావరి 1 కోటి 60 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 2 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, కృష్ణా జిల్లా నుండి 1 కోటి 75 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 1 కోటి 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి నటించిన ‘జన నాయగన్ ‘ చిత్రం తెలుగు లో ‘జన నాయకుడు’ అనే పేరుతో విడుదలైంది. ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడం తో , ఈ వీకెండ్ కి కూడా మూవీ లవర్స్ లో ‘లెనిన్’ బెస్ట్ ఛాయస్ కానుంది.
ఇక రేపు విడుదలయ్యే ‘చెన్నై లవ్ స్టోరీ’ సూపర్ హిట్ అయితే , కాస్త ఈ సినిమా పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ విషయానికి వస్తే , కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , ఓవర్సీస్ నుండి 3 కోట్ల 92 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో 4 కోట్ల మార్కుని దాటనుంది ఈ చిత్రం. ఓవరాల్ గా ఈ చిత్రానికి 36 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ రాగా, 67 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

