Homeఎంటర్టైన్మెంట్Akhil Akkineni: 'దయచేసి నన్ను నమ్మండి' అంటూ 'లెనిన్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎమోషనల్...

Akhil Akkineni: ‘దయచేసి నన్ను నమ్మండి’ అంటూ ‘లెనిన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయినా అఖిల్..

Akhil Akkineni: స్టార్ హీరో అయ్యేందుకు అన్ని విధాలుగా అర్హత ఉంది , పెద్ద సినీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది, కానీ ఇప్పటి వరకు కాలం కలిసి రాక సరైన బ్లాక్ బస్టర్ లేక అక్కినేని అఖిల్ కెరీర్ పరంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆయన గత చిత్రం ‘ఏజెంట్’ ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తో కచ్చితంగా స్టార్ హీరోల […]

Akhil Akkineni: స్టార్ హీరో అయ్యేందుకు అన్ని విధాలుగా అర్హత ఉంది , పెద్ద సినీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది, కానీ ఇప్పటి వరకు కాలం కలిసి రాక సరైన బ్లాక్ బస్టర్ లేక అక్కినేని అఖిల్ కెరీర్ పరంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆయన గత చిత్రం ‘ఏజెంట్’ ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తో కచ్చితంగా స్టార్ హీరోల లీగ్ లోకి అఖిల్ అడుగుపెడతారు అనే ఆశతో ఉండేవారు అక్కినేని ఫ్యాన్స్. కానీ ఆ ఆశలపై నీళ్లు జల్లింది ఈ చిత్రం. ఈ సినిమా తర్వాత దాదాపుగా మూడేళ్ళ సుదీర్ఘ విరామం తీసుకొని అఖిల్ చేసిన చిత్రం ‘లెనిన్’. నేడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలై ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.

ఈ ట్రైలర్ ని వైజాగ్ లో శరత్ థియేటర్ లో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు మేకర్స్. అఖిల్ తో పాటు మూవీ టీం మొత్తం హాజరైంది. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు నేను ఇక్కడ ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను. నేను సమయం వచ్చినప్పుడే మాట్లాడుతాను. ఈసారి నాకంటే సినిమా ఎక్కువ మాట్లాడుతుంది ఈసారి. ఇంతకంటే నేను ఏమి చెప్పలేను, మీకు అర్థం కావడం లేదు , నేను ఒక రెండు రోజుల నుండి అసలు నిద్రపోలేదు , అందుకే అద్దాలు పెట్టుకొని వచ్చాను, కానీ మిమ్మల్ని చూసి నాకు ఎనర్జీ వచ్చింది. జులై 10 వరకు నేను ఈ చిత్రం కోసం పని చేయడానికి కావాల్సినంత ఎనర్జీ ఈరోజు మీ ఉత్సాహాన్ని చూస్తే వచ్చింది. దయచేసి నన్ను క్షమించండి, మూడేళ్లు అయ్యింది మీ ముందుకొచ్చి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను , ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి’ అంటూ చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా ట్రైలర్ లోని డైలాగ్స్ ని కూడా ఆయన అభిమానుల కోసం చెప్పారు. అభిమానులు అయితే ట్రైలర్ చూసిన తర్వాత మంచి ఉత్సాహం తోనే ఉన్నారు, మరి సినిమా కూడా ఆ రేంజ్ లోనే వాళ్లకు ఎనర్జీ ని ఇస్తుందా లేదా అనేది తెలియాలంటే మరో 10 రోజులు ఎదురు చూడాల్సిందే. అఖిల్ కెరీర్ కి ఈ సినిమా సక్సెస్ అవ్వడం అత్యంత అవసరం , ఆయన అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ ఆశలు ఎంత మేరకు ఈ చిత్రం నెరవేరుస్తుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper