Akhanda Part 2: బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మన టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరుకు వచ్చిన మూవీస్ అన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక్క దానిని మించి ఒక్కటి సెన్సషనల్ హిట్స్ గా నిలిచాయి..ఈ క్రేజీ కాంబినేషన్ నుండి సినిమా వస్తుంది అంటే కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాదు..యావత్తు సినీ లోకం కూడా ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తుంది..ఇటీవలే వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవల విడుదల అయినా అన్నీ సూపర్ హిట్ సినిమాల కంటే ఈ సినిమాకి వచ్చిన లాంగ్ రన్ చాలా ఎక్కువ అనే చెప్పాలి..చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరుకు ప్రతి ఒక్కరిని ఈ సినిమా అలరించింది కాబట్టే అంత లాంగ్ రన్ వచ్చింది అని ట్రేడ్ పండితుల అంచనా..ఇక ఇటీవలే మా టీవీ లో ప్రసారం అయినా ఈ సినిమాకి అద్భుతమైన TRP రేటింగ్స్ కూడా వచ్చాయి.

ఈ సినిమా తర్వాత త్వరలో వీళ్లిద్దరి కాంబినేషన్ అఖండ కి సీక్వెల్ తెరకెక్కనుంది అని బోయపాటి శ్రీను ఇప్పటికే అధికారికంగా ఒక్క ఇంటర్వ్యూ లో తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..దీనికి సంబందించి స్క్రిప్ట్ వర్క్ కూడా ఆయన ఎప్పుడో పూర్తి చేసారు..కానీ ఈ సినిమా ప్రారంభం అయ్యే ముందే వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా అభిమానులను అలరించబోతుంది..పూర్తి స్థాయి పొలిటికల్ నేపథ్యం లో బాలయ్య ని అత్యంత పవర్ ఫుల్ గా చూపిస్తూ బోయపాటి శ్రీను ఒక్క కథని సిద్ధం చేసాడు అట..ఈ స్టోరీ లైన్ ఇటీవలే బాలయ్య బాబు కి వినిపించగా ఆయనకీ ఎంతో నచ్చడం తో ఈ సినిమాని చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు..ఈ ఏడాది లోపు స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది నుండి ఈ సినిమా షూటంగ్ ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు బోయపాటి శ్రీను సన్నాహాలు చేస్తున్నాడు అట..ఇక ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మించబోతున్నాడు అట.
Also Read: Rajasthan High Court: భార్యకు గర్భం తెప్పించేందుకు జైల్లో ఉన్న భర్తకు పెరోల్
ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని తో ఒక్క సినిమా చేస్తున్నాడు..క్రాక్ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి..ఇటీవలే ఈ సినిమాలో బాలయ్య బాబు కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చెయ్యగా, బాలయ్య బాబు గెటప్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తో కూడా ఒక్క సినిమా చేయనున్నాడు..బాలయ్య బాబు ఒక్క పూర్తి ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి దశాబ్దాలు అవుతుంది..ఆయన కెరీర్ మొత్తం సగానికి పైగా మాస్ సినిమాలే ఉన్న విషయం మన అందరికి తెలిసిందే..మధ్యలో టాప్ హీరో వంటి ఎంటర్టైన్మెంట్ జానర్ సినిమాలు చేసిన అవి ఎందుకో బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు..ఇప్పుడు ఆ జానర్ మీదనే త్వరలో అనిల్ రావిపూడి తో సినిమా చేయనున్నాడు బాలయ్య బాబు..ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
Also Read: Rashmi Gautam: అందాలతో రెచ్చిపోతున్న రష్మీ.. అలా వంగి అందాల జాతర..
Recommended Videos: