Cleaning Eggs: ప్రతి రోజు ఒక గుడ్డును తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి అనే విషయం మన అందరికీ తెలుసు. గుడ్డులో మనకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయనే ఉద్దేశంతోనే డాక్టర్లు కూడా ప్రతి రోజు ఒక గుడ్డును తినాలని సిఫారసు చేస్తుంటారు. అయితే చాలామంది యాపిల్ తినాలని లేదంటే అందుబాటులో ఉండే గుడ్డును ఏదో ఒక రూపంలో తినాలని చెబుతుంటారు. చాలామంది గుడ్డును తమ రోజు వారి ఆహారంలో తీసుకుంటూ ఉంటారు. అలా కుదరని వాళ్లు అప్పుడప్పుడు అయినా గుడ్డును తీసుకుంటూ ఉంటారు.

గుడ్డులో అన్ని రకాల పోషకాలు లభిస్తాయనే విషయం తెలుసు కదా. మరి దీనిని తినాలనే ఉద్దేశంతో చాలామంది షాపుల నుండి గుడ్లను తెచ్చి, వాటిని బాగా కడిగి వండి తింటూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల నష్టం వాటిల్లుతుందని తాజాగా ఓ రిపోర్టులో తేలింది. అంటే గుడ్డును కడిగి వాడటం వల్ల మనకు రావాల్సినంత లాభం రాదు అని ఆ రిపోర్ట్ చెబుతోంది. అసలు గుడ్డును కడిగి వాడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Also Read: Pawan Kalyan Rythu Bharosa Yatra: భరోసా యాత్రతో బాధితులకు భరోసా నింపిన పవన్
యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం, కమర్షియల్ గా ఉత్పత్తి చేసే గుడ్లను కడుగుతారు మరియు వాటికి పూత పూస్తారు. మరి ఇలాంటి గుడ్లను ఇంట్లో మరోసారి కడిగినప్పుడు గుడ్డు ఉపరితలం నుండి ‘క్యూటికల్’ లేదా ‘బ్లూమ్’ అనే సహజ రక్షణ పూత పోతుందట. పౌల్ట్రీలో గుడ్లను తయారు చేసే సమయంలో వాటిని కడిగి, వాటిపై ఎడిబుల్ మినరల్ ఆయిల్ ఫిల్మ్ ను పూతగా పూస్తారట. దీని వల్ల బ్యాక్టీరియా గుడ్లను కలుషితం చేయదట. ఒకవేళ ఇంట్లో గుడ్లను కడిగితే గుడ్డు లోపల బ్యాక్టీరియాను నెట్టివేస్తుందట. దీని వల్ల గుడ్లు వినియోగానికి పనికిరావట.

కాబట్టి ఇక మీదట గుడ్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వచ్చాక వాటిని కడగకుండా నేరుగా వాడాలని చెబుతున్నారు. గుడ్లను నీటితో కడగడం లేదంటే సబ్బు లేదంటే వేరే ఇతర లిక్విడ్ లతో కడగడం వల్ల నష్టం తప్పదని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చెబుతోంది. గుడ్డును ఉడికించి తింటే ఎలాగూ పైన ఉండే దానిని పగలగొట్టి తింటాము. ఆమ్లెట్ వేసినా పెంకను పగలగొట్టి వాడుతుంటాం. మరి అలాంటప్పుడు గుడ్లను కడగడం ఎందుకు అని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రశ్నిస్తోంది. కాబట్టి ఇక మీదట మీరు కూడా గుడ్లను తెచ్చినప్పుడు కడగకుండా నేరుగా వాడండి.
Also Read: Rashmi Gautam: అందాలతో రెచ్చిపోతున్న రష్మీ.. అలా వంగి అందాల జాతర..