Akhanda 2
Akhanda 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో బోయపాటి శ్రీను ఒకరు. మాస్ సినిమాలను చేయడంలో ఆయనకు ఆయనే సాటి ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన చేసిన ప్రతి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ భారీ లెవెల్లో ఉంటాయి. అందుకే ఆయన సినిమాలను మాస్ ప్రేక్షకులు విపరీతంగా ఆరాధిస్తూ ఉంటారు…
నందమూరి నటసింహం గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న బాలయ్య బాబు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నవే కావడం విశేషం. ఇక వరుసగా నాలుగు విజయాలతో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన బాలయ్య ఇప్పుడు ‘అఖండ 2’ (Akhanda 2) సినిమాతో మరోసారి సక్సెస్ ల పరంపరను కొనసాగించాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా తర్వాత ఆయన మరోసారి హరీష్ శంకర్ గోపీచంద్ మలినేని లాంటి దర్శకుడితో పనిచేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పటివరకు బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన సినిమాల్లో భారీ ఎలివేషన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. ఆయన సినిమాల్లో ఎక్కువగా వీటిని చూసే జనాలు ఆనంద పడుతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో అఖండ 2 లో అంతకుమించిన హై డోస్ తో యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయట. మరియు ప్రేక్షకులను ఎలాగైతే చూడాలని అనుకుంటున్నారో అలాంటి ఒక పవర్ ఫుల్ పాత్రలో బాలయ్య బాబున చూపిస్తున్నాడట. ఇక దాంతో పాటు గా డిఫరెంట్ యాంగిల్లో ఈ సినిమాలో బాలయ్యను చూపించబోతున్నారట.
Also Read : అయోమయంలో పడ్డ ‘అఖండ 2’ నిర్మాతలు..వెనకడుగు వేయక తప్పదా?
ప్రేక్షకులు ఈ సినిమాని చూసి ఎలా ఫీల్ అవుతారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాలో విపరీతమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక దానికి తగ్గట్టుగానే యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక బోయపాటి లాంటి దర్శకుడు బాలయ్య బాబుకి వరుసగా మూడు విజయాలు అందించాడు. కాబట్టి ఈ సినిమాతో నాలుగో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంటాడని బోయపాటి చాలా గర్వంగా చెబుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే బోయపాటి తను చేసే సినిమాల విషయంలో కూడా చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. తను గతంలో చేసిన స్కంద సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
దాంతో ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్న క్రమంలో అతని అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…
Also Read : అఖండ 2 లో ఒక్క ఫైట్ కోసం అంత ఖర్చుపెడుతున్నారా..?