Aishwarya Rai Suffering from Disease: దేశంలో అందమైన ఆడవారిలో ఎవరి పేరు చెబుతారంటే కచ్చితంగా ఐశ్వర్యరాయ్ పేరే చెబుతారు. అందానికి ఆమె నిదర్శనం. అందమైన వారి గురించి వర్ణించాలంటే మొదట ఐశ్వర్యరాయ్ నే ఆదర్శంగా తీసుకుంటారు. అందానికి ఆమె మారుపేరుగా నిలుస్తోంది. అందుకే అందరికి అందమంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఆమె. తన గ్లామర్ తో దేశవ్యాప్తంగా ఎంతో ఖ్యాతి గడించింది. అందానికి పర్యాయపదంగా నిలిచింది. బాలీవుడ్ లో తన అందంతో అదరగొట్టింది. అందరికి మతులుపోగొట్టింది.

సినిమాల్లో కూడా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడింది. ఓ పాపకు జన్మనిచ్చి తల్లి పాత్రను కూడా పోషిస్తోంది. ఇప్పుడు సినిమాలు తగ్గించి గృహిణిగానే బాధ్యతలు నిర్వహిస్తోంది. 1973 నవంబర్ 1న కర్ణాటకలో కృష్ణరాజ్ రాయ్, వ్రింద రాయ్ దంపతులకు జన్మించింది. చిన్నప్పటి నుంచే మోడలింగ్ పై మక్కువ ఉన్న ఆమె పలు టీవీ షోల్లో నటించింది. ఇక మిస్ యూనివర్స్ కు పోటీ పడినా సుస్మితా సేన్ ఆ స్థానం దక్కించుకోవడంతో ఆమె మిస్ వరల్డ్ కిరీటం అందుకుంది.
Also Read: Pawan Kalyan: మళ్లీ సమరం మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్

ఇక సినిమాల విషయంలో కూడా ఆమె మొదట మణిరత్నం సినిమాలో నటించింది. అది తెలుగులో ఇద్దరుగా వచ్చింది. తరువాత హిందీ సినిమాల్లో నటించి పలు అవార్డులు సొంతం చేసుకుంది. జోదా అక్బర్, ధూమ్ 2, రోబో చిత్రాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్ సినిమాల్లో నటనకు గాను ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాలు అందుకుంది. కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఓ భయంకరమైన జబ్బు బారిన పడినట్లు సమాచారం. అందుకే అటు సినిమాల్లో ఇటు బయట కూడా కనిపించడం లేదు.

అందానికి కొత్త భాష్యం చెప్పిన ఐశ్వర్యరాయ్ అంటే అందరికి ఇష్టమే. తన కళ్లతోనే మాట్లాడుతుంది. అందుకే ఆమెను అందరు ఆరాధిస్తున్నారు. ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. కానీ కొంత కాలంగా ఆమె ఓ భయంకరమైన వ్యాధికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతోనే ఆమె బయటకు రావడం లేదనే వాదనలు వస్తున్నాయి. ఇంతకీ ఆమెకు ఏమైంది? ఆమెకొచ్చిన జబ్బు ఏమిటి? నయం అవుతుందా? లేక ప్రాణాపాయమేమైనా ఉందా? అనే కోణంలో అందరు ఆలోచిస్తున్నారు. ఐశ్వర్యరాయ్ ఎందుకు ప్రజా జీవనంలోకి రావడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. దీనిపై వారి కుటుంబ సభ్యులే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
Recommended videos: