దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది, సాయం చేసే స్థితిలో ఉన్నవాళ్లు ముందుకు వచ్చి సమాజ సేవ చేస్తూ అవసరంలో ఉన్న పేదలకు జీవితం పై కొత్త ఆశలను కల్పిస్తున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా తన వంతుగా కరోనా బాధితులను ఆదుకోవాలని సదుద్దేశ్యంతో ‘కరోనా నివారణ విషయంలో గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు సరిపోవడం లేదని, నేను కూడా ముందుకు వచ్చాను. నిజంగా కష్టాల్లో ఉన్నవాళ్లు, చాల అవసరం ఉన్నవాళ్లు నాకు మెసేజ్ చేయండి’ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది.
దాంతో బాధితులు వేల సంఖ్యలో ఆమెకు మెసేజ్ లు చేశారు. దాంతో ఆమె అందరికీ సాయం చేయలేని పరిస్థితి. దీనికితోడు రేణు తన ఇన్ బాక్స్ ఓపెన్ చేయగానే అవసరార్థం మెసేజ్ లు చేసేవారి కంటే టైమ్ పాస్ మెసెజ్ లే ఎక్కువగా ఉన్నాయట. దీని పై రేణూ దేశాయ్ అసహనం వ్యక్తం చేస్తూ ‘దయచేసి కష్టాల్లో ఉన్నవారే మెసెజ్‌లు పంపండి. ఊరికే చాట్ చేయడానికి, హాయ్ అని మెసెజ్‌లు చేస్తే ఎలా’ అంటూ రేణూ చిన్న స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
మొత్తానికి గత కొన్ని రోజులుగా రేణూ దేశాయ్ ఎంతో మందికి సాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఓ నెటిజన్ మాత్రం రేణూ దేశాయ్ కి ఆగ్రహాన్ని తెప్పించాడు. అతను మెసేజ్ చేస్తూ.. ‘మీరు మిడిల్ క్లాస్ వాళ్లని ఎందుకు పట్టించుకోరు ? మాకు సాయం చేయరా ? మరి చేస్తాను అని ఎందుకు చెప్పారు ? అనే అర్ధం వచ్చేలా అతను రేణును ఘాటుగా ప్రశ్నించాడు.
ఆ నెటిజన్ చేసిన నెగిటివ్ మెసెజ్ చూసిన రేణూ దేశాయ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ‘దయచేసి అర్థం చేసుకోండి. వీలైనంతలో నేను గత పది రోజులుగా సాయం చేస్తూనే ఉన్నా. అయినా నేనేమీ రాజకీయ నాయకురాలిని కాదు.. మీరు ప్రశ్నించడానికి ? వెళ్లి మీరు ఓటు వేసిన నాయకులను అడుక్కోండి.. వారిని నిలదీయండి ? మీ రూడ్ మెసెజ్‌లు చూస్తుంటే, కొన్ని సార్లు నాలోని స్పిరిట్ దెబ్బతింటుంది. అయినా, నా ఇన్ బాక్స్‌లో లెక్కలేనన్ని మెసెజ్‌లు వస్తున్నాయి, మీ మెసెజ్ నేను చూడకపోతే.. మళ్లీ చేయండి, అంతేకాని ఇలాంటి మెసేజ్ లు పెట్టకండి’ అంటూ రేణూ దేశాయ్ ముగించింది