https://oktelugu.com/

Baahubali Prequel: 2 ఏళ్లు షూటింగ్.. 80 కోట్ల ఖర్చు చేసి బాహుబలి ప్రీక్వెల్ ను ఎందుకు ఆపేశారంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి సినిమా క్రియేట్ చేసిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ మార్పులను తీసుకువచ్చింది. ఇక ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు రావడమే కాకుండా రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలకు స్వస్తి పలుకుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 24, 2024 3:25 pm
    Baahubali Prequel

    Baahubali Prequel

    Follow us on

    Baahubali Prequel: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా బాహుబలి… ఈ సినిమా రెండు పార్టు లుగా రిలీజ్ అయి భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ వసూళ్లను సాధించి నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా సాధించిన విజయాన్ని పురస్కరించుకొని నెట్ ప్లిక్స్ సంస్థ బాహుబలికి ఫ్రీక్వెల్ ను తెరకెక్కించే పనిలో బిజీ అయ్యారు. బాహుబలి ‘బిఫోర్ ది బిగినింగ్’ అనే పేరుతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ నటుడు అయిన బిజయ్ ఆనంద్ ఈ ప్రాజెక్టు పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలైతే చేశాడు… ఇక బాహుబలి సినిమాకి ఫ్రీక్వెల్ ని నెట్ ప్లిక్స్ సంస్థ వారు అనౌన్స్ చేసిన తర్వాత మెయిన్ రోల్ లో తనను తీసుకున్నారని మొదట్లో తను సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్టు కి తను నో చెప్పారట. అయినప్పటికి తనను ఒప్పించి మరి ఈ ప్రాజెక్టుని స్టార్ట్ చేశారట. ఇక మొత్తానికైతే రెండు సంవత్సరాల పాటు నిర్విరామంగా ఈ ప్రాజెక్టుని కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన నెట్ ఫ్లిక్స్ సంస్థ 80 కోట్ల రూపాయల వరకు కూడా దీనిమీద ఖర్చు చేసిందట. ఇక మొత్తానికైతే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లేకుండా క్యాన్సల్ చేశారు అంటూ బిజయ్ ఆనంద్ తెలియజేశారు.

    తను రెండు సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం బీభత్సంగా కష్టపడ్డానని దానివల్ల చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చిన వదులుకున్నానని చెప్పాడు. కానీ ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోవడం తనకు బాధను కలిగిస్తుందని తెలియజేశాడు. ఇక ఇప్పుడు ఈయన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక మొత్తానికైతే వాళ్ళు పెట్టే బడ్జెట్ కి ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ కాదనే ఉద్దేశ్యం తోనే దీనిని క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తోంది…

    అయితే ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘ది రేజ్ ఆఫ్ శివగామి’, ‘క్విన్ ఆఫ్ మహిష్మతి’ నవలలను ఆధారంగా చేసుకొని ఈ ప్రాజెక్టుని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. మరి మొత్తానికైతే ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఆగిపోవడం పట్ల అందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా బాహుబలి సినిమాకు వచ్చిన క్రేజ్ ను వాడుకొని భారీగా డబ్బులును సంపాదించాలనే ప్రయత్నం చేసిన నెట్ ఫ్లిక్స్ సంస్థకి ఎదురుదెబ్బ అయితే తగిలిందనే చెప్పాలి. మరి ఈ ప్రాజెక్టును మళ్ళీ కంటిన్యూ చేసే ఉద్దేశ్యంలో ఉన్నారా లేదంటే పూర్తిగా నిలిపేశారా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…