https://oktelugu.com/

Ram Charan: రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా సక్సెస్ సాధిస్తుందా..? బుచ్చి బాబు సరిగ్గా హ్యాండిల్ చేయగలడా..?

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కూడా తీసుకొచ్చి పెట్టాయి.

Written By:
  • Gopi
  • , Updated On : November 24, 2024 / 03:21 PM IST

    Ram charan

    Follow us on

    Ram Charan: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హవా ఎక్కువగా కొనసాగుతుందనే చెప్పాలి. ఇక ఇప్పటికే పాన్ ఇండియాలో రామ్ చరణ్ తనదైన రీతిలో సత్తాను చాటుకోడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా అవతరించిన విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే పెరుగుతున్నాయి. ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న రామ్ చరణ్ తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని అందుకున్నట్లైతే ఆయనను మించిన నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యంలో బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాను కూడా సెట్స్ మీదకి తీసుకొచ్చాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక చిన్న షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

    ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దాంతో రామ్ చరణ్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తుండటం పట్ల ఇప్పుడు కొంతమందిలో కలవరామ్ కలుగుతుంది. ఇక సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబుకి అండగా ఉన్నాడు.

    కాబట్టి ఈ సినిమా మీద ఎవరు ఎలాంటి అభ్యంతరాలను పెట్టుకోవాల్సిన పనిలేదు అంటూ మరికొంతమంది వాళ్లకు సమాధానం అయితే చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి నటుడు తనదైన రీతిలో సత్తా చాటితే తప్ప ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవ్వదు. ఇక బుచ్చిబాబు కూడా ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకొని స్టార్ డైరెక్టర్ గా వెలుగుందుతాడా లేకపోతే ప్లాప్ ను మూటగట్టుకొని మళ్ళీ పాతాళానికి పడిపోతాడా అనేది తెలియాల్సి ఉంది.

    ఇక వీటిని మైండ్ లో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు బుచ్చిబాబు చేసిన సినిమా ఒకెత్తు అయితే ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా మరొకెత్తు… ఇక రామ్ చరణ్ స్టార్ డమ్ ని మ్యాచ్ చేస్తూ కథని డెప్త్ గా చెప్పే ప్రయత్నం అయితే చేయాలి. ఏమాత్రం తేడా జరిగిన కూడా సినిమా తేడా కొట్టే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వాటిని మైండ్ లో పెట్టుకొని బుచ్చిబాబు ముందుకు సాగితే మంచిదని సినిమా పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…