https://oktelugu.com/

వెంకీ కాదన్న రీమేక్‌లో అడవి శేష్!

బాలీవుడ్‌ వైవిధ్య నటుడు ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ‘ఆర్టికల్ 15’ చిత్రం హిందీలో ఒక ఊపు ఊపింది. మూవీ రిలీజైన తొలి రోజు నుంచే అద్భుత స్పందన వచ్చింది. విమర్శల ప్రశంసలు అందుకుంది. సమాజంలో కుల వివక్షను ఎత్తి చూపే కథాంశంతో వచ్చిన ఈ మూవీలో ఆయుష్మాన్‌ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. అనుభవ్‌ సిన్హా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మించింది. గతేడాది విడుదలై ఘన విజయంతో పాటు పలు పురస్కారాలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 10, 2020 / 03:04 PM IST
    Follow us on


    బాలీవుడ్‌ వైవిధ్య నటుడు ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ‘ఆర్టికల్ 15’ చిత్రం హిందీలో ఒక ఊపు ఊపింది. మూవీ రిలీజైన తొలి రోజు నుంచే అద్భుత స్పందన వచ్చింది. విమర్శల ప్రశంసలు అందుకుంది. సమాజంలో కుల వివక్షను ఎత్తి చూపే కథాంశంతో వచ్చిన ఈ మూవీలో ఆయుష్మాన్‌ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. అనుభవ్‌ సిన్హా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మించింది. గతేడాది విడుదలై ఘన విజయంతో పాటు పలు పురస్కారాలు అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారన్న వార్తలు కొన్ని నెలల నుంచి వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌ బాబు ఈ రీమేక్‌పై ఆసక్తి చూపిస్తున్నారని, ఆయన తమ్ముడు వెంకటేశ్‌ హీరోగా నటిస్తాడన్న టాక్‌ వచ్చింది. అయితే, దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దాంతో, ఈ రీమేక్‌ ఆలోచనను సురేశ్‌ విరమించుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వెంకీ ఆసక్తి చూపించలేకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టినట్టు సమాచారం.

    Also Read: స్టార్ హీరో కుమారుడితో సోషల్ మీడియా బ్యూటీ!

    కానీ, ఆర్టికల్‌ 15 తెలుగు రీమేక్‌ టాపిక్‌ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా ఈ మూవీ కోసం టాలెంటెడ్‌ యాక్టర్ అడవి శేష్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. చిన్న గ్రామంలో కనిపించకుండాపోయిన ముగ్గురు అమ్మాయిల కేసును దర్యాప్తు చేసే క్రమంలో వెలుగు చూసే అనూహ్య ఘటనలే ఆర్టికల్‌15 మూవీ ఇతివృత్తం. ఇలాంటి ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్స్‌ అడవి శేష్‌కు కొట్టిన పిండి. క్షణం, గూఢచారి, ఎవరు చిత్రాల్లో ఇలాంటి పాత్రలే చేశాడతను. దాంతో, ఆర్టికల్‌ 15 తెలుగు రీమేక్‌కు అతనే సరైనోడు అనిపిస్తోంది. అతను ఓకే చేబుతాడా లేదో చూడాలి.

    Also Read: రూ. 200 కోట్లతో ఎన్టీఆర్ మూవీ?

    శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్నాడు. 26/11 ఉగ్రదాడి సందర్భంగా తన ధైర్య సాహసాలతో హీరోగా నిలిచిన మేజర్ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుంది. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ఈ చిత్రానికి నిర్మాత.