‘ఈనాడు’తో లాభం లేదనుకుంటున్న రామోజీ?

తెలుగు ప్రింట్ మీడియాలో ఈనాడు పేపర్ కు తిరుగులేదంటే అతిశయోక్తి కాదేమో.. ఉదయం లేవగానే ఈనాడులో వార్తలు చూడనిదే చాలామందికి పొద్దుగడవు.. అంతలా ఈనాడు పత్రిక ప్రతీఒక్కరి దినచర్యలో భాగమైంది. అయితే ఇప్పుడు ప్రింట్ మీడియాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికితోడు కరోనా ఎఫెక్ట్ తోడవడంతో ప్రింట్ మీడియాకు భారీగా ఆదాయం పడిపోతుంది. దీంతో పెద్ద పత్రికలుగా చెలామణి అవుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు ఆదాయ మార్గాలపై దృష్టిసారించాయి. వీటిలో సాక్షి, నమస్తే […]

Written By: Neelambaram, Updated On : August 10, 2020 2:45 pm
Follow us on


తెలుగు ప్రింట్ మీడియాలో ఈనాడు పేపర్ కు తిరుగులేదంటే అతిశయోక్తి కాదేమో.. ఉదయం లేవగానే ఈనాడులో వార్తలు చూడనిదే చాలామందికి పొద్దుగడవు.. అంతలా ఈనాడు పత్రిక ప్రతీఒక్కరి దినచర్యలో భాగమైంది. అయితే ఇప్పుడు ప్రింట్ మీడియాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికితోడు కరోనా ఎఫెక్ట్ తోడవడంతో ప్రింట్ మీడియాకు భారీగా ఆదాయం పడిపోతుంది. దీంతో పెద్ద పత్రికలుగా చెలామణి అవుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు ఆదాయ మార్గాలపై దృష్టిసారించాయి. వీటిలో సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలకు ప్రభుత్వాల అండ ఉండటంతో వాటికి ఇప్పట్లో వచ్చే ఇబ్బందేమీ లేదని చెప్పొచ్చు.

Also Read: జగన్, నమ్మకం.. ఓ పోసాని కథ!

ఇక మిగిలింది ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలే. తొలి నుంచి ఈనాడు పత్రికలే తెలుగులో ట్రెండ్ క్రియేట్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. మిగిలిన పేపర్లన్నీ గుడ్డిగా ఈనాడును ఫాలో అవుతుంటాయి. రామోజీ రావు ఈనాడులో ఏ సంస్కరణ అవలంభిస్తూదో ఆ వెంటనే ఆంధ్రజ్యోతిలో అమలవుతూ ఉంటుంది. ఈనాడు ప్లానింగ్ నే మక్కికిమక్కి ఆంధ్రజ్యోతి ఫాలో అవుతుందనే టాక్ మీడియా వర్గాల్లో విన్పిస్తుంది. ఇక కొద్దిరోజులుగా ఈనాడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుండటంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల జీతాల్లో కోతలు, సెలవులపై పంపడం వంటివి జరుగుతున్నాయి. ఇది ఒక్క ఈనాడుకే పరిమితం కాలేదు.. దాదాపు అన్ని మీడియా సంస్థలు ఉద్యోగుల తొలగింపు, జీతాల్లో కోత విధించేందుకు పోటాపోటీ పడుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు నెంబర్ వన్ గా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఖర్చులు పెరగడం.. ఆదాయం తగ్గడంతో ఈనాడులో సంస్కరణ మొదలయ్యాయి. రానున్న రోజుల్లోనూ ప్రింట్ మీడియా కోలుకునే అవకాశం లేకపోవడంతో రామోజీ రావుకు ఈనాడుపై ఓ నిర్ణయానికి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. జిల్లాల్లో ఇప్పుడు ఉన్న యూనిట్లను మెల్లిమెల్లిగా తగ్గిస్తూ రానున్న రోజుల్లో పూర్తిగా ఎత్తేసేందుకే మొగ్గుచూపుతుందట. ఒక్కొ పేపర్ ప్రింట్ కు రూ.18 అవుతుండగా అది మార్కెట్లో రూ.6 అమ్మాల్సి వస్తోంది. రానున్న రోజుల్లోనూ ఆదాయం(టీడీపీ యాడ్స్) వస్తాయన్న నమ్మకం లేకపోవడంతో రామోజీ రావును ఈనాడు ప్రింట్ మీడియాను వదిలించుకునే యత్నం చేస్తున్నారనే టాక్ విన్పిస్తోంది.

Also Read: అడ్డంగా బుక్కయిన కేటీఆర్…! అలా మాట్లాడి ఉండకూడదు

మరోవైపు ఈనాడు ప్రింట్ మీడియాలో ఖర్చులను తగ్గిస్తూ డిజిటల్ రంగంపై ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగానే ఈనాడుకు ఇప్పటికే ఉన్న ఈనాడు.నెట్, ఈ పేపర్ పై దృష్టిసారించింది. ఈనాడు పేపర్ చదివే వారందరిని డిజిటల్ కు అలవాటు పడేలా చేయనుంది. ఇందులో భాగంగానే నాలుగు నెలల నుంచి ఈనాడు ఆదివారం మ్యాగజైన్.. రోజువారీ ప్రత్యేక పేజీలు కేవలం వెబ్ ఎడిషన్లు మాత్రమే ఇస్తున్నారు. ఈనాడుకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. వీరికి నెలవారీ సబ్ స్క్రిప్షన్ ఇచ్చి ఇకపై ఆన్ లైన్లోనే నగదు వసూలు చేసే ప్రణాళికలను చేస్తోంది.

గత నాలుగు నెలల్లో వ్యూస్ కూడా బాగానే వచ్చాయట. దీంతో ప్రింట్ మీడియాను పక్కకు పెట్టి డిజిటల్ వైపే ఈనాడు ఫోకస్ పెట్టింది. అయితే వెబ్ పోటీని ఈనాడు ఏమాత్రం తట్టుకోగలుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఈటీవీ భారత్ యాప్ తీసుకొచ్చి ఈనాడు దెబ్బతింది. అయితే ఈ-పేపర్, ఈనాడు.నెట్ తోనే ఎన్నిరోజులు వెబ్ మీడియాలో నెట్టుకోస్తారనేదనేది చూడాల్సిందే. ఇప్పటికే ఈనాడు ప్రింట్ మీడియాతో రానున్న రోజుల్లో పెద్దగా లాభం లేదనే రామోజీ దృష్టికి వెళ్లింది. స్వతహాగా వ్యాపారవేత్త అయిన రామోజీ లాభం లేకుండా ఎన్నిరోజులు ఈనాడు ప్రింట్ మీడియాను భుజాన మోస్తారనేది వేచి చూడాల్సిందే..! ఇక ఆయన బాటలో నడిచేందుకు ఇప్పటకే పలు ప్రింట్ మీడియా సంస్థలు సన్నహాలు చేసుకుంటుండటం గమనార్హం.