https://oktelugu.com/

కేసీఆర్ తప్పులపై కాంగ్రెస్ మళ్లీ ఫెయిల్?

తెలంగాణలో కరోనా తీవ్రంగా ప్రబలుతున్న వేళ అవన్నింటిని పక్కనపెట్టి కేసీఆర్ సర్కార్ సచివాలయం కూల్చివేతలో బిజీ అయ్యింది. దీనిపై ప్రజల్లో, ప్రతిపక్షంలో తీవ్ర వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఏకంగా 400 కోట్లకు పైగా రిలీజ్ చేసి కేసీఆర్ సర్కార్ ముందుకెళుతోంది. Also Read: అడ్డంగా బుక్కయిన కేటీఆర్…! అలా మాట్లాడి ఉండకూడదు అయితే ఇంతటి కరోనా క్లిష్ట సమయంలో వైద్యసేవలపై దృష్టిసారించకుండా బిల్డింగులు కడుతానంటున్న కేసీఆర్ సర్కార్ వ్యవహారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన కాంగ్రెస్ మాత్రం […]

Written By:
  • NARESH
  • , Updated On : August 10, 2020 / 03:46 PM IST
    Follow us on


    తెలంగాణలో కరోనా తీవ్రంగా ప్రబలుతున్న వేళ అవన్నింటిని పక్కనపెట్టి కేసీఆర్ సర్కార్ సచివాలయం కూల్చివేతలో బిజీ అయ్యింది. దీనిపై ప్రజల్లో, ప్రతిపక్షంలో తీవ్ర వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఏకంగా 400 కోట్లకు పైగా రిలీజ్ చేసి కేసీఆర్ సర్కార్ ముందుకెళుతోంది.

    Also Read: అడ్డంగా బుక్కయిన కేటీఆర్…! అలా మాట్లాడి ఉండకూడదు

    అయితే ఇంతటి కరోనా క్లిష్ట సమయంలో వైద్యసేవలపై దృష్టిసారించకుండా బిల్డింగులు కడుతానంటున్న కేసీఆర్ సర్కార్ వ్యవహారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన కాంగ్రెస్ మాత్రం పిల్లిమొగ్గులు వేస్తోంది. కరెక్ట్ గా గురిచూసి కొట్టకుండా అభాసుపాలవుతోంది. వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ కు దెబ్బ పడింది.

    మొదటగా.. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు మీడియాకు, ప్రజలను అనుమతించకుండా కూలుస్తున్నారని.. జీ బ్లాక్ కింద నిజాం నిధి ఉందంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఇలా గుప్త నిధులంటూ హైకోర్టును ఆశ్రయించడంపై రేవంత్ కు హైకోర్టు చీవాట్లు పెట్టింది.

    Also Read: కేసీఆర్ పై కోపం.. కానీ ఏం చేయలేకపోతున్నారు!

    ఇక అది మరిచిపోకముందే తాజాగా మరోసారి సచివాలయం కూల్చివేతలను పరిశీలించేందుకు అనుమతించాలని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వరరెడ్డిలు దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే విచారణ కోరే హక్కు ఉంటుంది కానీ.. ఫీల్డ్ లోకి వెళ్లి విచారణ జరిపే అధికారం లేదంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా సచివాలయం కూల్చివేతల పరిశీలనకు అనుమతించాలన్న కాంగ్రెస్ నేతలకు హైకోర్టులో చుక్కెదురైంది.

    రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ నేతలు ఫెయిల్ అయ్యారనే చెప్పవచ్చు. ఎందుకంటే సచివాలయం కూల్చివేతలో ఏదో మతలబు ఉందన్న విషయం బహిరంగ రహస్యమే.. కేసీఆర్ సర్కార్ ఫెయిల్యూర్ ను ఎండగట్టడంలో కాంగ్రెస్ పిల్లిమొగ్గులు వేస్తూ కరెక్ట్ గా వ్యవహరించడం లేదన్న టాక్ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.