spot_img
Homeఎంటర్టైన్మెంట్ఆ దేశం నుంచి గోల్డెన్​ వీసా పొందిన తొలి మహిళా నటిగా త్రిష రికార్డు!

ఆ దేశం నుంచి గోల్డెన్​ వీసా పొందిన తొలి మహిళా నటిగా త్రిష రికార్డు!

తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకుని దక్షిణాదిలోనే ఎక్కువ ఫాలోయింగ్​ ఉన్న హీరోయిన్​ త్రిష. సహాయనటిగా సినీరంగ ప్రవేశం చేసి.. ఆ తర్వాత వరుసగా హీరోయిన్​ అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్​లోని టాప్​ హీరోలందరితో స్క్రీన్​ షేర్​ చేసుకుంది. మరోవైపు తమిళంలోనూ టాప్​ హీరోయిన్​గా నిలిచింది. నాలుగు పదుల వయసు వస్తున్నా త్రిషకు క్రేజ్​ మాత్రం తగ్గట్లేదు. అయితే, గత కొన్నిరోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటూ వస్తోంది ఈ అమ్మడు. తాజాగా, తన సెకండ్​ ఇన్నింగ్స్​ను స్టార్ట్​ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే 96 మూవీలో సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన త్రిష. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇదిలా ఉండగా, త్రిషకు అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్​ వీసా ఆమెను వరించింది. ఈ వీసా అందుకున్న తొలి తమిళ నటిగా త్రిష రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. యూఏఈ  నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందన్నారు త్రిష. ఇప్పటికే ఈ వీసాను ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, అర్జున్ కపూర్, మోహన్ లాల్ మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, నేహా కక్కర్, అమాల్ మాలిక్, కేఎస్ వంటి ప్రముఖులు అందుకున్నారు. ఈ వీసా ఉన్నవారు సూదీర్ఘకాలం వరకు యూఏఈలో ఉండవచ్చు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...
Oktelugu Epaper
Exit mobile version